అన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి విరాళం

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖకు చెందిన సీహెచ్‌.దుర్గాప్రసాద్‌ రూ.1,00,001 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

చికెన్‌ ధరలు

Advertisement
 
Advertisement
Advertisement