పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడికి గ్లోబల్‌ విజనరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడికి గ్లోబల్‌ విజనరీ అవార్డు

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

ఆరిలోవ: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, తోటగరువు జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మడ్డు శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ విజనరీ సమ్మిట్‌ ఎక్స్‌పో అవార్డు ఇన్‌ ఎడ్యుకేషన్‌–2026’లభించింది. రుషికొండలోని రిసార్ట్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐకాన్‌ గ్లోబల్‌ విజనరీ సంస్థ ప్రతినిధులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. గ్రామ అభ్యుదయ కమిటీని ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకు విద్యా సంబంధిత పోటీ పరీక్షల్లో విశేష తోడ్పాటునందించినందుకు గాను ఈ అవార్డు దక్కినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement