నగరం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం వేళ భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద జీవులు, ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ కష్టార్జితం కోసం శ్రమిస్తున్నారు. మధ్యాహ్నం వేళ.. కాస్త విశ్రాంతి కోసం.. కాంక్రీట్ వనాల మధ్య ఉన్న ఒక పచ్చని చెట్టును ఆశ్రయించారు. సిమెంట్ రోడ్డుపై వారు పోతున్న ఆ గాఢ నిద్ర వారి దైనందిన పోరాటానికి మౌన సాక్ష్యం.
– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


