ఈసెట్‌లో గాజువాక విద్యార్థికి మొదటి ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

ఈసెట్‌లో గాజువాక విద్యార్థికి మొదటి ర్యాంకు

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

గాజువాక : స్థానిక అజీమాబాద్‌కు చెందిన పండ్ల వ్యాపారి గోవిందరాజు కుమారుడు సింహాద్రి వంశీ ఏపీఈసెట్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 158 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమా కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన అతడు 93 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. డిఫెన్స్‌లోగాని, స్పేస్‌ సెక్టార్‌లో గాని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాలనే తపనతో నిరంతరం శ్రమించానని, రోజుకు 12 గంటల పాటు చదివి విజయం సాధించానని వంశీ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement