ఇండియన్ రైల్వే ఆధునీకరణలో ఇది సరికొత్త అధ్యాయం. ఈ లోకోమోటివ్స్ ద్వారా భారీ సరుకును వేగంగా తరలించడం ద్వారా సప్లై చైన్‌లో జాప్యం ఉండదు. అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్ల వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాం. దేశీయంగా తయారు చెయ్యడంతో పాటు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. వేగవంతమైన రవాణా వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు త్వరగా మార్కెట్లోకి చేరడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంలా మారుతుంది.
– సునీల్ మాథుర్, సీమెన్స్ ఎండీ, సీఈవో


