ఘనంగా సిరి వెంకటేశ్వర డెవలపర్స్‌ 20వ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సిరి వెంకటేశ్వర డెవలపర్స్‌ 20వ వార్షికోత్సవం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

సీతంపేట: సిరి వెంకటేశ్వర డెవలపర్స్‌ సంస్థ 20వ వార్షికోత్సవాన్ని శుక్రవారం శంకరమఠం రోడ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.కె.రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మిత్రులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్‌ సిబ్బంది అందించిన నిరంతర సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 20 ఏళ్లలో 20 వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేశామని, ప్రస్తుతం 6 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆనందపురం సమీపంలోని గూగుల్‌ సిటీకి దగ్గరగా సరికొత్త వెంచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్‌ బృందం, ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సంస్థ పురోగతిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement