ద.కో. ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా రాజ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ద.కో. ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా రాజ్‌కుమార్‌

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు తొలి ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా ఐఆర్‌ఎస్‌ఈ 1989 బ్యాచ్‌కు చెందిన బి.ఎస్‌.కె.రాజ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ భువనేశ్వర్‌లోని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఏయూ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ముంబయిలోని ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. రైల్వేలో దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన.. తన సర్వీసులో ట్రాక్‌లు, బ్రిడ్జిలు, భారీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులను పర్యవేక్షించారు. దక్షిణ మధ్య రైల్వే, నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో ఆయన పని చేశారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్‌, ట్రిపుల్‌ లైన్‌ ప్రాజెక్టుల ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌, కమిషనింగ్‌లో రాజ్‌కుమార్‌కు అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలోనే చీఫ్‌ బ్రిడ్జి ఇంజినీర్‌గా, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా కూడా సేవలందించారు.

Advertisement
 
Advertisement
Advertisement