ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై త్రిశూలం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 9న దీని ప్రారంభోత్సవం కావడంతో పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇక్కడ ప్లాట్‌ఫాంపై త్రిశూలం, డమరుకం అమర్చడం పూర్తయింది. ఇంకా ఉద్యానవనం, సందర్శకులు సేదదీరేందుకు సిమెంట్‌బెంచీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. డమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభమైతే ఈ పర్యాటక కేంద్రం మరింత ఆకర్షణీయంగా మారనుందని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. రూ.1.55 కోట్లతో కొండ చివరన ఏర్పాటు చేసిన 55 అడుగుల పొడవుండే ఈ త్రిశూలం కై లాసగిరికి వెళ్లే పర్యాటకులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు కనిపిస్తుంది. జాతీయరహదారిపై డెయిరీఫారం, ఇసుకతోట, మద్దిలపాలెం వరకు, బీచ్‌రోడ్డు వైపు ఎంవీపీ కాలనీ, ఏయూ వరకు, బీఆర్‌టీఎస్ రోడ్డులో ఆరిలోవ, ముడసర్లోవ వైపు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.


