మహారాణిపేట: కేజీహెచ్ పిల్లల శస్త్రచికిత్స విభాగానికి ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ రూ.4.50 లక్షలు విరాళమిచ్చింది. పిల్లల ఆరోగ్య సేవలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. సంబంధిత చెక్కును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి పిల్లల విభాగ వైద్యుల సమక్షంలో ఈసాయ్ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, మదన్ మోహన్, జోసెఫ్ కిరణ్‌లు బుధవారం అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి.రాజేంద్ర ప్రసాద్, ఆచార్యులు డాక్టర్ జె. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విరాళం అందించిన ఈసాయ్ ప్రతినిధులకు సూపరిటెండెంట్ డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు.


