కేకే లైన్‌ విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

కేకే లైన్‌ విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలి

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

ఎంవీపీ కాలనీ: కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని ఏపీ లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. స్థానిక ఉషోదయ కూడలిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో అంశాలను తక్షణమే కేంద్రం అమలు చేయాలని సూచించారు. రైల్వేజోన్‌పై గతంలో మాజీ మంత్రి కొణతాల ఆధ్వర్యంలో లోక్‌ సత్తా, వామపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో పాటు కేంద్రంలోని పలు పార్టీల కీలక నాయకులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లో కొనసాగించకపోవడం దారుణమన్నారు. దీనిపై సీఎంతో సహా, రాష్ట్ర ఎంపీలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేకే లైన్‌ను విశాఖలో కొనసాగించడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా రైళ్లు, బోర్డ్‌ ఉద్యోగాల కేటాయింపులు చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్‌సత్తా నగర అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్‌ మూర్తి, మార్రపు సుధీర్‌, ఇప్పలవలస గోపి, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement