అంధుల క్రికెట్‌ సిరీస్‌ విజేత ఏపీ | - | Sakshi
Sakshi News home page

అంధుల క్రికెట్‌ సిరీస్‌ విజేత ఏపీ

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

తమిళనాడుపై ఏపీ ఆధిక్యం

విశాఖ స్పోర్ట్స్‌: బియాండ్‌ సైట్‌ వుమెన్‌ క్రికెట్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 3–0తో తమిళనాడు జట్టుపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రైల్వే స్టేడియంలో బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఏపీ జట్టు ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఐదు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్‌ సింధుకు దీపలక్ష్మి తోడై 51 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్‌ను 66 పరుగులకు చేర్చారు. ప్రియాంక, మిక్కా చెరో వికెట్‌ తీశారు. ప్రతిగా ఏపీ జట్టు ఓపెనర్‌ సంధ్య(10) 18 పరుగుల వద్దే వెనుదిరిగినా.. ఇంకో ఓపెనర్‌ మిక్కా(52)తో కలిసి కెప్టెన్‌ సత్య(28) మరో వికెట్‌ కోల్పోకుండానే 9.1 ఓవర్లలో 99 పరుగులు చేసి గెలుపొందారు. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో తమిళనాడు నాలుగు వికెట్లకు 119 పరుగులు చేయగా ఏపీ జట్టు 10.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. రెండో మ్యాచ్‌లో తమిళనాడు రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసినా ఏపీ జట్టు 13.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement
 
Advertisement
Advertisement