గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పరవాడ: తిక్కవానిపాలెం బీచ్‌లో సోమవారం రాత్రి గల్లంతైన యువకుడు కావూరి గురునాథరావు ఆచూకీ మంగళవారం నాటికీ లభ్యం కాలేదని పరవాడ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు చెప్పారు. యువకుడి ఆచూకీ కోసం మెరెన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బందితో తీరం వెంబడి అప్పికొండ, పూడిమడక ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాలతో జల్లెడ పట్టారు. అయినా ఫలితం కనిపించలేదన్నారు. యువకుడి ఆచూకీ కోసం తీర ప్రాంతం వెంబడి పోలీస్‌ స్టేషన్‌లకు సమాచారం అందజేశామన్నారు. బుధవారం ఉదయానికల్లా యువకుడి ఆచూకీ లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement