డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటి సరఫరాలో జాప్యం, పైపులైన్ల లీకేజీలు లేదా ఇతర అంతరాయాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1800–4250–0009కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆయా వార్డులకు సంబంధించిన మంచినీటి విభాగం సహాయక ఇంజనీర్ల పేర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలను కూడా ఈ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నీటి సరఫరా నిర్ణీత సమయానికి రాకపోయినా లేదా పంపిణీలో ఏవైనా సమస్యలు ఎదురైనా, ప్రజలు వెంటనే ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తమ ఫిర్యాదులను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.


