విశాఖ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి పక్షోత్సవాలను విశాఖ పోర్ట్ అథారిటీ రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించింది. మంగళవారం పోర్ట్ పరిపాలన భవనంలోని సాంబమూర్తి ఆడిటోరియంలో వీపీఏ డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి, ఇతర విభాగాధిపతులు, పోర్ట్ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోర్ట్ ఎస్సీ, ఎస్టీ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోర్ట్ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఎం.దేవిశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓ.రామలింగం, కార్యదర్శి జి.శివరామకృష్ణ, కోశాధికారి ఎం.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


