పరవాడ తీరంలో గల్లంతైన పాలిటెక్నిక్‌ విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

పరవాడ తీరంలో గల్లంతైన పాలిటెక్నిక్‌ విద్యార్థి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

పరవాడ: మండలంలోని తిక్కవానిపాలెం తీరంలో సోమవారం సాయంత్రం అలల తాకిడికి గురై కావూరి గురునాథరావు (19) అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన ఇతడు, అండమాన్‌ నుంచి వచ్చిన స్నేహితులతో కలిసి తీరానికి వెళ్లాడు. సరదాగా స్నానానికి దిగిన సమయంలో రాకాసి అలలు అతడిని లోపలికి లాక్కొని పోయాయి. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న ఏకై క కుమారుడు కళ్లెదుటే గల్లంతవడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement