నవ్వుల్లో ముంచెత్తిన కామెడీ స్కిట్లు | - | Sakshi
Sakshi News home page

నవ్వుల్లో ముంచెత్తిన కామెడీ స్కిట్లు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

సీతంపేట: ఫ్రెండ్స్‌ కామెడీ క్లబ్‌(విశాఖ, హైదరాబాద్‌) ప్రతి నెలా నిర్వహించే వినోదాల విందులో భాగంగా, ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో కామెడీ షో నిర్వహించారు. ఎం.వి.సుబ్రహ్మణ్యం, జబర్దస్త్‌ ప్రకాష్‌, రాగన్‌ నాయుడు, సూర్య మర్రాపు, పుష్యమి, బోను నరసింహారావు చేసిన కామెడీ స్కిట్లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. వీటిలో పెళ్లి తప్పిపోయింది. దెబ్బలు ఎలాగా తగిలాయి, నీకు తెలుసా, కూర చీర, లంచ్‌ బాక్స్‌, మాటలు మనుషులు, సాటి ఆడవాళ్లు స్కిట్లు నవ్వులు పూయించాయి. ముందుగా శ్రీ వాగ్దేవి నృత్యాలయం నాయుడుతోట గురువు సౌందర్య శిష్య బృందం లక్ష్మీ కార్తీక, మౌనిమా, రూత్విక్‌, గ్రీష్మశ్రీ, జషిత, పల్లవిక, మేధాశ్రీ, మనస్వి, తోషిని, యశశ్విలు శాసీ్త్రయ నాట్య ప్రదర్శనతో అలరించారు.

Advertisement
 
Advertisement
Advertisement