మార్కెట్లోకి ట్రయంఫ్‌ కొత్త బైక్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ట్రయంఫ్‌ కొత్త బైక్‌

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

మహారాణిపేట: ప్రపంచ ప్రసిద్ధ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ నుంచి సరికొత్త ట్రాకర్‌ 400 మోడల్‌ను విశాఖలో ఆదివారం ఆవిష్కరించారు. బీచ్‌రోడ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరుణ్‌ బజాజ్‌ సీఈవో ఆడారి శ్రీనివాస్‌ కొత్త బైక్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్‌, శక్తివంతమైన పనితీరుతో రూపొందించిన ఈ మోడల్‌ రైడర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ట్రాకర్‌ 400 మోడల్‌ను భారతీయ రైడర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు. రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన స్టైలిష్‌ లుక్‌ ఈ బైక్‌ సొంతమని పేర్కొన్నారు. విశాఖ మార్కెట్లో ఈ మోడల్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బైక్‌ బ్లాక్‌, ఎల్లో, సిల్వర్‌ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని, దీని ఎక్స్‌–షోరూమ్‌ ధర రూ.2.46 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వరుణ్‌ గ్రూప్‌ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement