
ప్రేమతో.. టీకా!
● విశ్వసనీయ నేస్తాలకు రేబిస్ నుంచి రక్షణ ● ఉచిత రేబిస్ టీకా కార్యక్రమానికి విశేష స్పందన
డాబాగార్డెన్స్: నగరంలోని జడ్జికోర్టు సమీపంలోని ప్రభుత్వ పశువైద్య శాల ప్రాంగణం ఆదివారం సందడిగా కనిపించింది. విభిన్న జాతుల శునకాలు, వాటిని ప్రేమగా లాలిస్తున్న యజమానులతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ నిర్వహించిన ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చిట్టి పొట్టి పప్పీల నుంచి రాజసంగా నడిచే పెద్ద శునకాల వరకు.. ఒకటా రెండా.. ఎన్నెన్నో జాతులు, వర్ణాలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. నగరం నలుమూలల నుంచి శునక ప్రేమికులు తమ ప్రియమైన నేస్తాలకు రేబిస్ నుంచి రక్షణ
కల్పించడానికి తరలివచ్చారు. తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూస్తూ.. యజమానుల మాట వింటూ, వారు చూపించే ప్రేమకు ప్రతీకగా నిలుస్తూ ఆ శునకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే ప్రమాదకరమైనవే జూనోటిక్ వ్యాధులు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి పెంపుడు జంతువులను, తద్వారా మనల్ని మనం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి కిశోర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఉచిత టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!

ప్రేమతో.. టీకా!