
అలా భోగాపురానికి..
నాటి అడుగులే.. నేడు రహదారులు..
8 విస్తరణ.. 15 కొత్త రోడ్లు
ఈ 15 రహదారులలో 8 రోడ్లను విస్తరించనున్నారు. మిగిలిన ఏడు రోడ్లను కొత్తగా అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా అయినాడ జంక్షన్ నుంచి రింగ్‌రోడ్–ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మధ్య 9 మీటర్ల రోడ్డు ఉండగా.. దాన్ని 24 మీటర్లకు విస్తరించనున్నారు. తగరపువలస (చిట్టివలస రోడ్డు) నుంచి మూలకుద్దు మధ్య ఉన్న రోడ్డును 45 మీటర్లకు, దొరతోట రోడ్డు జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం మధ్య 60 మీటర్లకు, బోయపాలెం జంక్షన్ నుంచి మంగమారిపేట జంక్షన్, శివశక్తి నగర్ నుంచి హరిత ప్రాజెక్ట్స్, అడవివరం నుంచి గండిగుండం, పినగాడి నుంచి వేపగుంట రోడ్లను విస్తరించనున్నారు. అలాగే దాకమర్రి–రావాడ, చిప్పాడ–పోలిపల్లి (దివీస్ రోడ్డు), నేరెళ్లవలస–తాళ్లవలస, గంభీరం–గంభీరం హైవే, పరదేశిపాలెం–గంభీరం, వేపగుంట–జుత్తాడల మధ్య కొత్త రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
విశాఖ సిటీ : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ప్రణాళికలే నేడు బాటలుగా మారుతున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి 15 కొత్త రహదారుల నిర్మాణాలకు అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయాసంగా, వేగంగా రాకపోకలు సాగించేందుకు కొత్త రోడ్లు సిద్ధం కానున్నాయి. ఇందుకోసం వీఎంఆర్‌డీఏ అంచనాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. వచ్చే నెలలో టెండర్లు పిలిచి మే నుంచి రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.392 కోట్ల అంచనా వ్యయంతో 82.08 కిలోమీటర్ల మేరకు విస్తరణ, కొత్త రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
వైఎస్సార్ ప్రభుత్వంలో ప్రణాళికలు
విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జాతీయ రహదారికి అనుసంధానంగా 15 ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయాలని గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని మాస్టర్ ప్లాన్‌లో కూడా చేర్చింది. వీటిలో ఇప్పటికే ఒక రోడ్డు పూర్తి కాగా.. మిగిలిన 14 రహదారుల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి నిర్మాణాలను వీఎంఆర్‌డీఏతో పాటు జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ శాఖలు చేపట్టనున్నాయి. అయితే అత్యధికంగా 8 రహదారుల నిర్మాణ బాధ్యతను వీఎంఆర్‌డీఏ తీసుకుంటోంది. ఆర్‌అండ్‌బీ 3, జీవీఎంసీ 2 రోడ్లను నిర్మించనున్నాయి. మిగిలిన నాలుగు రహదారులను కూడా జీవీఎంసీ, ఆర్‌అండ్ బీలతో కలిపి వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేయనుంది.
భోగాపురం విమానాశ్రయం కనెక్టివిటీకి 15 రహదారుల అభివృద్ధి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.392 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు
వచ్చే ఏడాది జూన్ నాటికి
పూర్తి చేయాలని లక్ష్యం
నిర్మాణాలకు సిద్ధమవుతున్న
ఆర్‌అండ్‌బీ, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ
వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి
భోగాపురం విమానాశ్రయం పనులు పూర్తయ్యేలోగా ఈ రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సునాయాశంగా రాకపోకలు సాగించడానికి అనువుగా ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు సంబంధించి వచ్చే నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి మేలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం.
– కె.ఎస్.విశ్వనాథన్,
మెట్రోపాలిటన్ కమిషనర్
రహదారి నిర్మాణ శాఖ కి.మీ.
అయినాడ జంక్షన్–ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఆర్‌అండ్‌బీ 6.5
దాకమర్రి–రావాడ వీఎంఆర్‌డీఏ 6.66
చిప్పాడ–పోలిపల్లి(దివీస్‌రోడ్డు) వీఎంఆర్‌డీఏ 6.32
తగరపువలస–మూలకుద్దు జీవీఎంసీ 3.6
నేరేళ్లవలస–తాళ్లవలస వీఎంఆర్‌డీఏ 4
దొరతోట జంక్షన్–కుమ్మరిపాలెం ఆర్‌అండ్‌బీ 6.2
బోయపాలెం–మంగమారిపేట వీఎంఆర్‌డీఏ 6
గంభీరం–గంభీరం ఎన్‌హెచ్16 వీఎంఆర్‌డీఏ 2.2
పరదేశిపాలెం–గంభీరం వీఎంఆర్‌డీఏ 1.4
మారికవలస–తిమ్మాపురం జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ 6.3
శివశక్తినగర్–హరిత ప్రాజెక్ట్స్ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ 1.7
అడవివరం–గండిగుండం ఆర్‌అండ్‌బీ, వీఎంఆర్‌డీఏ 8
గండిగుండం–చింతలపాలెం వీఎంఆర్‌డీఏ 9.9
వేపగుంట–జుత్తాడ జీవీఎంసీ 6.05
పినగాడి–వేపగుంట ఆర్ అండ్ బీ 7.25

అలా భోగాపురానికి..