మోమిన్‌పేట్, మర్పల్లి మండలాలపరిధిలో భూగర్భ నిల్వలు
203 చదరపు కిలోమీటర్లలో టైటానియం, వెనేడియం మూలకాలు
ఇప్పటికే బిడ్డింగులు ఆహ్వానించి టెండర్లు అప్పగింత
త్వరలో తవ్వకాలు
ఉపయోగం ఇలా..
వికారాబాద్: జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించిన కేంద్రం వాటిని తవ్వి తీసేందుకు సిద్ధమైంది. మన సరిహద్దు ప్రాంతంలో (ఆర్‌ఈఈ) రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టైటానియం, వెనేడియం మూలకాలు మన ప్రాంతంలో ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే జియాలాజికల్ సర్వే నిపుణులు పరిశోధనలు పూర్తి చేశారు. మైనింగ్ కోసం కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. దక్కించుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిడ్లు వేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా ఐదారేళ్ల క్రితమే మొదటి విడత మైనింగ్ కేటాయింపులను పూర్తి చేయగా.. ప్రస్తుతం రెండో విడత కేటాయింపులకు కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల అరుదైన ఖనిజాలను గుర్తించగా మన రాష్ట్రంలో మూడు చోట్ల ఉన్నాయని తేల్చారు. ఇందులో ఒకటి సిద్దిపేట జిల్లాలో.. మరొకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. ఇంకొకటి వికారాబాద్ – సంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు తేల్చారు. మన జిల్లా పరిధిలోని మోమిన్‌పేట్, మర్పల్లి మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ మండలంలో 203 చదరపు కిలో మీటర్లలో ఈ టైటానియం, వెనేడియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
ఆనందంతోపాటు భయాందోళన
టెండరు దక్కించుక్ను సంస్థలు మైనింగ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. త్వరలో టైటానియం, వెనే డియం నిక్షేపాలను వెలికి తీయనున్నారు. దీని ద్వా రా జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధి అవకాశాలు కూ డా పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో పక్క ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మైనింగ్ కారణంగా ఈ ప్రాంతం దుమ్మూధూళితో నిండిపోతుందనే భయం కూడా ఉంది. టైటానియం తవ్వకాలతో ప్రమాదం తక్కువే అయినా వెనేడియంతో వాతావరణం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. వెనేడియంతో అనేక ఉపయోగాలు ఉన్నా ఇది విషపూరిత మూలకం కావడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే గ్రామ సభలు, అభిప్రాయ సేకరణ చేయకుండా మైనింగ్‌కు సిద్ధం కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. మనవ మనుగడకు విఘాతం కలిగించే చర్యలకు దిగితే అడ్డుకుంటామని పలువురు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో అరుదైన నిక్షేపాలు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 118 మూలకాలను గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో టైటానియం 22వ మూలకంగా.. వెనేడియాన్ని 23 వ మూలకంగా గుర్తించారు. టైటానియం తేలికై న మూలకం.. ఇది ఉక్కు కంటే కూడా గట్టిగా ఉంటుంది. లభ్యత చాల తక్కువ కావడంతో అరుదైనదిగా గుర్తింపు పొందింది. దీన్ని దంతాలకు వేసే తొడుగుల తయారీకి, ఆర్థోకు సంబంధించి శరీరం లోపల అమర్చే వైద్య పరికరాల తయారీకి వినియోగిస్తారు. విమానాల విడి భాగాలు, అంతరిక్ష పరికరాలు, మిస్సైల్ తయారీలో వినియోగించే పరికరా లు ఈ టైటానియంతోనే తయారు చేస్తారు.ఈ మూ లకానికి తుప్పు పట్టే గుణం తక్కువగా ఉన్నందున జలాంతర్గాముల తయారీ,ఇతర సముద్రంలో ప యనించే వాహనాల తయారీకి వినియోగిస్తారు. స ముద్ర జలాల శుద్ధికి సైతం ఉపయోగ పడనుంది. దీని ధర స్టీల్‌తో పోలిస్తే 40 నుంచి 50 రెట్లు అధికంగా ఉంటుంది. వెనేడియం మూలకాన్ని విద్యుత్ శక్తి నిల్వ చేసే పరికరాల తయారీకి వినియోగిస్తారు. బ్యాటరీల తయారీకి ఉపయోగ పడనుంది.


