పంట మార్పిడితో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో ప్రయోజనం

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

కేంద్రియ సమగ్ర సస్యరక్షణ సెంటర్‌

ఇన్‌చార్జ్‌ వెంకట్‌రెడ్డి

మోమిన్‌పేట: పంట మార్పిడితో అధిక దిగు బడి, లాభాలు పొందవచ్చని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ వెంకట్‌రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని మొరంగపల్లి లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం ద్వారా పెట్టుబడులు పెరగడంతోపాటు దిగుబడి తగ్గుతుందన్నారు. పంట మార్పిడితో ఈ సమస్య నుంచి బయట పడొచ్చని తెలిపారు. రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాటి ఫలితాల ఆధారంగానే సాగు చేయాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దన్నారు. భూసారం పెంచేందుకు పచ్చి రొట్ట ఎరువులు వాడాలన్నారు. గడ్డి మందు, కీటక మందుల వాడకం తగ్గించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొంటే విధిగా రసీదు పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అరుణ, ప్లాంటు ప్రొటెష్షన్‌ ఆఫీసర్‌ హోనప్ప, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఉదయ్‌ శంకర్‌, ఏఓ రామకృష్ణారెడ్డి, ఏఈఓలు స్వాతి, పెంటయ్య, రైతులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమం

కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

కొడంగల్‌: నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదింటిలో పెళ్లి జరిగితే ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, తహసీల్దార్‌ రాంబాబు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు రమేష్‌ బాబు, పర్సాపూర్‌ మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ హమీద్‌ పాల్గొన్నారు.

కంది విత్తనాల పంపిణీ

కొడంగల్‌: పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఒక్కో కిట్‌ నాలుగు కిలోల చొప్పున 400 కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో విత్తనాలను ఉచితంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబయ్య గౌడ్‌, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ గుప్తా, ఏడీఏ శంకర్‌ రాథోడ్‌, ఏఓ శ్రీలత, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

తమ్మలి సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

అనంతగిరి: తమ్మలి సంఘం జిల్లా నూతన కమిటీని గురువారం వికారాబాద్‌లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శి గా వెంకటరాములు, కోశాధికారిగా పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా రమేష్‌, అశోక్‌, జగదీశ్వర్‌, వ ర్కింగ్‌ ప్రసిడెంట్‌గా శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శులుగా రమేష్‌, శరణప్ప, అశోక్‌, శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మనోహర్‌, శ్రీనివాస్‌, వీరేశం, మహిళ కార్యదర్శులుగా ప్రభావతి, రేణుక, షర్మిల, సలహాదారులుగా సురేందర్‌, శ్రీనివాస్‌, చంద్రమౌళి, సంగయ్య, సత్యనా రాయణ, విఠల్‌, రాజేందర్‌ ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement