న్యూస్‌రీల్
అమాంతం పెరిగిన భోజనం,
టిఫిన్ ధరలు
వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడమే కారణం
గ్యాస్ ధరలు పెంచక ముందు నుంచే ధరల మంట
పది నుంచి 25 శాతానికి పెంపు
తిరుపతిలో పలు హోటళ్లలో
భోజనం కరువు
జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు
45 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత్తలు
విలవిలలాడిన ప్రజానీకం
‘సింధు’కు కన్నీటి నివాళి
తిరుపతి క్రైం : తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో భద్రతా విధుల్లో విశేష సేవలందించిన ఒక మౌన సైనికురాలు ఇకలేరు. తిరుపతి జిల్లా పోలీస్ శునక దళానికి చెందిన ఎక్స్‌ప్లోసివ్ డిటెక్షన్ శునకం ‘సింధు’ సహజ కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచింది. శనివారం పోలీసులు నివాళులర్పించారు. లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఆడ శునకం ‘సింధు’ 28 డిసెంబర్ 2013న జన్మించింది. చిన్న వయసులోనే ఆమె ప్రతిభను గుర్తించిన అధికారులు 2014లో హైదరాబాద్‌లోని ఐఐటీఏ, మొయినాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అందించారు. అక్కడి నుంచి తిరుమల–తిరుపతి ప్రాంతాలకు చేరుకున్న ‘సింధు’ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగించింది. 2021లో మంగళగిరిలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో మూడో బహుమతి సాధించడం ద్వారా తన సామర్థ్యాన్ని మరోసారి చాటింది. వయోభారంతో 2023 సెప్టెంబర్ 2 న విధుల నుంచి విరమణ చేసిన ఆమె, విశ్రాంతి జీవితం గడుపుతూ శుక్రవారం సాయంత్రం కన్ను మూసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, ‘పోలీస్ శునక దళం సభ్యులు కూడా మా కుటుంబంలో అంతర్భాగమే’ అన్నారు. సింధు మృతికి పోలీ సు అధికారులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కన్నీటి నివాళులు అర్పించారు.
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి సిటీ: నగరంలో ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యా హ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు విద్యార్థులను 11గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,542 మంది పరీక్షకు హాజరుకానున్నారని, విద్యార్థులు నిర్లక్ష్యం వహించకుండా సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు తెలిపారు.
ప్రశాంతంగా ఏపీ ఐసెట్
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2026 శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఐసెట్‌కు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో 95 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో, పుత్తూరు శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన ఈ ఐసెట్‌కు 1,598 మందికి గాను 1,518 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలోని ఓ ప్రధాన హోటల్‌లో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్‌లో నేడు భోజనం రూ.160. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అనేక మంది భక్తులు వెళ్లే మరో హోటల్‌లో నేడు భోజనం రూ.180కి పెంచారు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో స్పెషల్ భోజనం రూ.180 నుంచి రూ.220 చేశారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్‌లో భోజ నం రూ.120 నుంచి రూ.180కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 20 శాతం పెంచేశారు. తమిళనాడు వాసులు ఎక్కువశాతం వెళ్లే హోటల్‌లో భోజనం ధరలతో పాటు జ్యూస్ ధరలు కూడా అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు ఒక జ్యూస్ ధర రూ.90 ఉంటే.. నేడు అదే జ్యూస్ ధర రూ.146కి పెంచేశారు. ఈ ధరలు మొన్నటి వరకు. నిన్నటి నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు పెంచడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తప్పని జీఎస్టీ
చపాతి, పూరీకి జీఎస్టీ లేదని కేంద్రం ప్రకటించినా.. నగరంలోని పలు హోటళ్లలో జీఎస్టీతో కలిపి బిల్లు వేస్తున్నారు. తినుబండారాలు ధరలు కూడా పెరిగాయి. వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలు పర్యాటక, ఆధ్యాతిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అందకే తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చంద్రగిరి, కాణిపాకం ప్రాంతాలకు భక్తులతో పాటు పర్యాటకులు కూడా అధికంగా వచ్చి వెళుతుంటారు. పర్యాటకులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో పలు మెస్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నడుపుతున్నారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ కొరత కారణంగా తిరుపతి, చిత్తూరులో పలు హోటళ్లలో భోజనం ఆపేశారు. మరి కొన్ని హోటళ్లను పూర్తిగా మూసివేశారు. ప్రధానంగా తిరుపతిలో రెండు మూడు హోటళ్లలో మాత్రమే భోజనం లభ్యమవుతుంది. గ్యాస్ కొరత, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ హోటళ్ల నిర్వాకులు భోజనం, టిపిన్స్, చపాతీ, పరోటా ధరలను అమాంతం పెంచేశారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో నేటి నుంచి కొత్త ధరలు అమలు చేయనున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
తిరుపతి సిటీ: జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడారు. దాదాపు అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా 45 డిగ్రీల మార్కును చేరుకున్నాయి. శనివారం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత్తలకు వృద్ధులు, చిన్నారులు, బాలింతల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రత్తలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు, మరోవైపు గాలివానతో అకాల వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో సాధారణంగా 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోద వుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్కపోత, బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయంలో కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు పడ్డాయి. గతేడాది ఇదే రోజున 36–39 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీలు దాటడడంతో ప్రధాన రహదారులు, పట్టణంలోని వీధులన్నీ నిర్యానుష్యంగా మారుతున్నాయి.
జాగ్రత్తలు అవసరం
గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని వైద్యుల నివేదిక. అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గంటకొకసారి కచ్చితంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, అంబలి, నిమ్మరసం తదితర సహజ సిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకూడదు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలి. సన్ స్క్రీన్ లోషన్లు, కూలింగ్ గ్లాసు, గొడుగు, ఒక లీటరు నీరు వెంట తీసుకుని వెళ్లాలి. మాంస పదార్థాలు, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం, మద్యం సేవించరాదు. – డాక్టర్ జ్యోతి కుమార్, ఆయుర్వేద
వైద్య నిపుణులు, వీజే హాస్పిటల్, తిరుపతి
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో అటానమస్ హోదాలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు గత నెల 8వ తేదీ నుంచి 13 వరకు ప్రాక్టికల్స్, 16వ తేదీ నుంచి 29వరకు థియరీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటానమస్ హోదాలో ఫలితాలను విడుదల చేయడం గర్వకారణమన్నారు. పలు కోర్సులలో 93.6% ఉత్తీర్ణత సాధించగా, మరి కొన్ని కోర్సుల్లో 100 శాతం ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌న్స్ డాక్టర్ చలపతి, ఎగ్జామినేషన్ సెక్షన్ ఉద్యోగులు కామేశ్వరరావు, రమేష్, చక్రవర్తి, నాగరాజు, శేషాద్రి, ప్రభాకర్, పురుషోత్తమనాయుడు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
చంద్రగిరి: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న చంద్రగిరిలో రౌడీలు రాజ్యమేలుతున్నారని, ఎమ్మెల్యే నాని అండతో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. పాకాల మండలం శ్రీనివాసపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ నాయుడిపై శుక్రవారం చంద్రగిరి మండలంలోని తొండవాడ సమీపంలో ఎమ్మెల్యే నాని అనుచరులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఈనేపథ్యంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు శనివారం చంద్రగిరి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ పార్టీ నేతపై హత్యాయత్నానికి పాల్పడిన ఎమ్మెల్యే నాని అనుచరులు వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగారు. ఆపై బాధితుడు, పార్టీ శ్రేణులతో కలసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రెస్‌మీట్లు పెడితే అంతు చూస్తారా..?
చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడితే అంతు చూస్తామంటూ హత్యాయత్నానికి పాల్పడతారా? అని ఎమ్మెల్యే నానిని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ప్రశ్నించారు. తొండవాడ సాయిబాబా ఆలయం వద్ద ఆరుగురు వ్యక్తులు మాధవ నాయుడిని చుట్టుముట్టి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. ‘‘నానీ అన్నపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావా..? నీ అంతు చూస్తాం..’’ అంటూ దుండగులు పళ్లు రాళ్లగొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచడం హేయమైన చర్య అన్నారు. చంద్రగిరి సీఐ సురేష్ కుమార్‌ను కలసిన ఆయన మాధవ నాయుడిపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుంటే సోమవారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మాధవ నాయుడితో కలసి పోలీసులకు
ఫిర్యాదు చేస్తున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, పార్టీ శ్రేణులు
వామ్మో.. హోటల్ తిండా?
మెస్‌ల్లోనూ..
సామాన్యులు తినే మెస్‌ల్లో భోజనం రూ.80 నుంచి రూ.120 ఉండేది. పదిహేను రోజులుగా అదే హోట ళ్లలో భోజనం రూ.160కి పెంచేశారు. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ప్లేట్ ఇడ్లీ మొన్నటి వరకు రూ.20 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ రూ.35 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. దోశ,పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. వెజ్ రైస్, గోబీ, దొండకాయ రైస్ వంటివి ప్రస్తుతం రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇవే పదిహేను రోజుల క్రితం వరకు రూ.50 నుంచి రూ.80 మాత్రమే. ఇకపోతే మెస్‌ల్లో సంగటి, మటన్, చికెన్‌తో కలిపి భోజనం మొన్నటి వరకు రూ.120 విక్రయించేవారు. ప్రస్తుతం రూ.190 నుంచి రూ.240కి పెంచేశారు.
జిల్లాలో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు
నియోజకవర్గం నమోదైన ఉష్ణోగ్రతలు
(డిగ్రీల సెల్సీయస్‌లో)
గరిష్టం కనిష్టం
వెంకటగిరి 45 28
తిరుపతి 44 27
చంద్రగిరి 44 27
శ్రీకాళహస్తి 44 27
సూళ్లూరుపేట 43 28
కోడూరు 43 27
సత్యవేడు 42 28
నిప్పుల కొలిమి...!
రెట్టింపు కానున్న ఆహార పదార్థాల ధరలు
తిరుపతి, చిత్తూరు జిల్లాలో హోటళ్లతో పాటు కర్రీ పాయింట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అన్నం వండుకుని కూరల కోసం కర్రీ పాయింట్లను ఆశ్రయిస్తుంటారు. అటువంటి వారికి ధరల భారం తప్పదు. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే అనేక కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. ఉన్న కర్రీ పాయింట్లు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. తాజాగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడంతో కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే స్వీట్లు, సేవరీస్ వంటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ యుద్ధం పుణ్యమా అని సామాన్యుడి పరిస్థితి దయానీయంగా మారింది. సంపాదన అంతంత మాత్రమే ఉన్నా.. ఖర్చులు అంతకంతకు పెరిగిపోతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి
ఏజెంట్‌గా ఉన్నందుకే హత్యాయత్నం
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బూత్ ఏజెంట్‌గా, ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్‌గా కూర్చున్నందుకే తనపై ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధితుడు మాధవ నాయుడు తెలిపారు. గతంలోనే తనపై రెండుసార్లు దాడికి యత్నించారని, అయితే ఇప్పుడు పక్కా వ్యూహంతో అంతమొందించేందుకు దాడికి తెగబడ్డారన్నారు. ఇదంతా ఎమ్మెల్యే నాని పనే అని, ఆయన అనుచరుడు రామిరెడ్డి అనే వ్యక్తితో తనపై దాడి చేయించాడని స్పష్టం చేశాడు.


