
నవోదయ ఫలితాల్లో ‘విశ్వం’ ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటించిన రెండో విడత ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యార్థులు ప్రతిభ చాటారు. బి.సాత్విక, ఎన్.ఝాన్సీరెడ్డి అర్హత సాధించినట్లు విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు మొత్తం 57మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులనుఅకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు. 2026 నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
పకడ్బందీగా ‘టీబీ ముక్త్ భారత్’
తిరుపతి తుడా: జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభి యాన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శైలజ తెలిపారు. న్నమయ్య జిల్లా నుంచి తిరుపతి ఆడిషనల్ డీఎంహెచ్‌ఓగా ఆమె బదీలపై వచ్చారు. బుధవారం ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ జిల్లాలో టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తానని చెప్పారు. అన్ని ఇండికేటర్లలో నిర్దేశించిన లక్ష్యాలను అందరి సహకారంతో 100 శాతం సాధించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్షయ బాధితులను వేగంగా గుర్తించడం, మరణాలను తగ్గించడం వంటి అంశాలే అజెండాగా పనిచేయనున్నట్లు వివరించారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగ,మద్యం తాగేవారు, టీబీ నుంచి ఉపశమనం పొందిన వారు, హెచ్‌ఐ వీ పాజిటీవ్, బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్న వారు, గర్భిణులు, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారని వెల్లడించారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వారికి ఆరు నెలల చికిత్స ఉచితంగా అందిస్తామన్నారు. ఆ సమయంలో పౌష్టికాహారం తీసుకోవ డంకోసం రోగి ఖాతాలో రూ.1000లు జమ చేస్తా మని తెలిపారు. కార్యక్రమంలో క్షయ నివారణ ఉద్యోగులు లోకేష్, మురళి,మొహిద్దీన్, దేవరాజు లు, సుకన్య , సౌజన్య , మహేశ్వ పాల్గొన్నారు.

నవోదయ ఫలితాల్లో ‘విశ్వం’ ప్రతిభ