న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ

Published Sat, May 25 2024 1:30 AM

న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ

రాయలసీమ జిల్లాలోని న్యాయమూర్తులను వివిధ అంశాలపై నిర్వహించిన శిక్షణ తరగతులు ముగిశాయి.

సమస్యాత్మక ప్రాంతాల్లో

పోలీస్‌ పికెట్‌

తిరుపతి క్రైమ్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ రవి మహోహరాచారి తెలిపారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్‌ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నామన్నారు. కేసులకు సంబంధించిన అన్ని పార్టీల వారిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. ఎక్కడా అమాయకులపై కేసులు పెట్టి ఇరికించలేదని, చట్ట ప్రకారమే అరెస్ట్‌లు జరిగాయని వివరించారు. కౌంటింగ్‌ రోజున సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని ముందస్తుగానే గుర్తించి బైండోవర్‌ చేస్తామన్నారు. కౌంటింగ్‌ రోజున గెలిచిన వారితోపాటు ఓడిన వారికి కూడా ఎస్కార్ట్‌ ఇచ్చి నేరుగా ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతే అనుమతి తీసుకుని సంబరాలు జరుపుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ రోజు విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

భక్తులకు మాత్రమే రూమ్‌లు

జూన్‌ 1 నుంచి 4వ తేదీ రాత్రి వరకు తిరుపతిలోని అన్ని లాడ్జిల్లో శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే రూమ్‌లు కేటాయించాలన్నారు. రాజకీయ నాయకులు, ఇతర పనులపై వచ్చిన వారికి రూమ్‌లు కేటాయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరంతరం లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో యూనివర్సిటీ సీఐ మురళీమోహన్‌ పాల్గొన్నారు.

– 8లో

Advertisement
 
Advertisement
 
Advertisement