మార్చి 1 నుంచి షర్మిల పాదయాత్ర | YS Sharmila To Recommence Padayatra Will Start From March 1St | Sakshi
Sakshi News home page

మార్చి 1 నుంచి షర్మిల పాదయాత్ర

Feb 10 2022 3:08 AM | Updated on Feb 10 2022 4:24 PM

YS Sharmila To Recommence Padayatra Will Start From March 1St - Sakshi

టీటీడబ్ల్యూయూ నాయకులను  పార్టీలోకి ఆహ్వానిస్తున్న షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల తన ప్రజాస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. మార్చి 1 నుంచి యాత్రను కొనసాగించేం దుకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది నవంబర్‌ 21న స్థానిక ఎన్ని కలు, కరోనా వల్ల పాదయాత్రకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడటంతో యాత్రను కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి మళ్లీ పాదయత్రను కొనసాగించనున్నట్టు పార్టీ వర్గా లు పేర్కొంటున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ దయానంద్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యూనియన్‌ నాయకులు వైఎస్సార్‌టీపీలో చేరారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో నాయకులకు షర్మిల పార్టీ కం డువా కప్పి ఆహ్వానించారు.  త్వరలో  ఆటో యూనియన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement