రఘునందన్‌రావు‌ను వెంటాడుతున్న మహిళ

Women Campaign Against Raghunandan In Dubbaka - Sakshi

సాక్షి, సిద్దిపేట : బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. వరుసగా మూడోసారి దుబ్బాక బరిలో నిలిచిన విజయ కోసం పరితపిస్తున్న ఆయనకు ఓ మహిళ రూపంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తన అనుచరులు 40 లక్షల రూపాయలతో పోలీసులకు చిక్కగా.. తాజాగా మరో సమస్య వచ్చిపడింది. గతంలో రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసి వార్లల్లో నిలిచిన మహిళ మరోసారి తెరపైకి వచ్చింది. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?)

తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రాధారమణి అనే మహిళ గత ఫిబ్రవరిలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓకేసు నిమిత్తం న్యాయవాది అయిన రఘునందన్‌ను ఆశ్రయిస్తే.. తనకు మత్తుమందుఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇంటింటికి తిరుగుతూ రఘునందన్ తనకు చేసిన అన్యాయాన్ని మహిళలకు చెబుతూ అతనికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది పోలీసులను, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని చెబుతోంది. ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించడమే తన లక్క్ష్యమని రాధారామణి ప్రచారం చేస్తోంది. (రఘునందన్‌తో ప్రాణహాని: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి)

మరోవైపు ఆమె ప్రచారంపై రఘునందర్‌రావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రత్యర్థుల కుట్రగా భావిస్తున్నారు. ప్రచారంలో తమకంటే ముందున్న బీజేపీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top