
పెళ్లి ఖర్చుకు వెనకాడని నేటి యువత
వారి అభీష్టాలనూ గౌరవిస్తున్న పెద్దలు
103 బిలియన్ డాలర్లకు చేరిన పరిశ్రమ
సగం వ్యయం ఈవెంట్ ప్లానింగ్, కేటరింగ్‌లకే..
మెట్రో నగరాల్లో థీమ్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లపై పెరిగిన ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: వివాహ అనుభూతులను పదికాలాల పాటు పదిలంగా భద్రపరుచుకునేందుకు నేటితరం ఎంతైనా ఖర్చు చేస్తోంది. థీమ్, లగ్జరీ, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఏమాత్రం తగ్గడం లేదు. మనసెరిగిన వ్యక్తితో కలిసి ఏడడుగులు నడవాలని అమ్మాయిలు.. తమ ఇంటిని చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు.. భాగస్వామి ఎంపికలో పరిణతితో వ్యవహరిస్తున్నా రు. కులమతాలకు అతీతంగా ఎన్నో జంటలు ఒక్కటవుతున్నాయి. తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. చివరికి పిల్లల అభీష్టం మేరకు వైభవంగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు.
⇒ దేశంలో సగటు వివాహ ఖర్చు వార్షిక కుటుంబ ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయని తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) తెలిపింది. గతేడాది నాటికి దేశీయ వివాహ సేవల మార్కెట్ 103.93 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏటా 14.3 శాతం వృద్ధి రేటుతో 2030 నాటికి 228.69 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2023లో ఇది 92.3 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో వెడ్‌మీగుడ్, వెడ్డింగ్స్, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, శుభ్ ముహూర్త్, వెడ్డింగ్ బజార్ వంటి సంస్థలు వెడ్డింగ్ పరిశ్రమలో సేవలందిస్తున్నాయి.
కోటి మందికి ఉద్యోగావకాశాలు..
⇒ వివాహ వేదికలు, ఆభరణాలు, దుస్తులు, కేటరింగ్, ఆహా్వన పత్రికలు, బహుమతులు, డెకొరేషన్, ఈవెంట్ ప్లానింగ్, లాజిస్టిక్, మేకప్, ఫొటో, వీడియోగ్రఫీ, మ్యూజిక్, డీజే వంటి విభాగాలు వివాహ మార్కెట్ కిందికి వస్తాయి. ఇందులో వేదికలు, కేటరింగ్, ఇని్వటేషన్, బహుమతులు ప్రధానమైన విభాగాలు. వెడ్డింగ్ ప్లానర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, డెకొరేషన్, మేకప్ ఆరి్టస్టుల వంటి రూపంలో వివాహ పరిశ్రమ సుమారు కోటి మందికి ఉద్యోగ అవకాశాలను కలి్పస్తోంది. భారత వివాహ సేవల పరిశ్రమ వృద్ధిలో సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది.
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించే ట్రెండ్‌ల ద్వారా ప్రేరణ పొందిన జంటలు, ప్రత్యేకమైన, యునిక్ వివాహ అనుభవాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. వివాహ వేడుకలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవల వైపు ఈ ధోరణి పెరుగుతోంది. వివాహ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఈవెంట్, సంగీత్ ప్లానింగ్‌లలో సాంకేతికత వినియోగిస్తున్నారు. థాయ్‌లాండ్, జపాన్, మాల్దీవులు, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఖర్చుకు ఎందుకు వెనకాడట్లేదంటే..
వివాహాలకు ఇంత ఖర్చు చేయడానికి కారణాలు విశ్లేíÙస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చిన్న వయసులో కుర్రకారు పెద్ద మొత్తంలో సంపాదిస్తుండటం, భవిష్యత్తులో మరింత ఆర్జించగలమనే ధీమాతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వారే ఆ సొమ్మును సమకూర్చుతున్నారు. సిటీలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా వారే కన్వెక్షన్ కేంద్రాల బుకింగ్ దగ్గర్నుంచి పెళ్లి మండపం, అలంకరణ వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహాలకు సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలు, ఇతర నగరాలకు వెళ్తుంటే.. మధ్యతరగతి వర్గాలు కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్‌లలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌ల నుంచి మొదలుపెట్టి ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్ పారీ్టలు, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ వరకు తగ్గేదేలే అన్నట్లుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
విభాగాల వారీగా వివాహ పరిశ్రమలో ఖర్చులు (శాతంలో)
విభాగం వ్యయాలు
⇒ వేదికలు, కేటరింగ్ 30
⇒ ఈవెంట్ ప్లానింగ్ 12
⇒ డెకొరేషన్ 14
⇒బహుమతులు 19
⇒ఆహా్వనాలు 2
⇒ఫొటోగ్రఫీ 3
⇒మేకప్ 3
⇒ హనీమూన్/టూరిజం 8
⇒ లాజిస్టిక్స్ 9
శివార్లలో ఈవెంట్ సిటీ అవసరం (ఫొటో కామన్‌లో రవి పేరుతో ఉంది)– రవి బూర, జనరల్ సెక్రటరీ, టీసీఈఐ
ప్రస్తుతం రాష్ట్రంలో 15–20 వేల మందితో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే వేదికలు లేవు. అందుకే శివారు ప్రాంతంలో 100–200 ఎకరాల్లో ఈవెంట్ సిటీని అభివృద్ధి చేయాలి. పీపీపీ విధానంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు టీసీఈఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. చైనా, లాస్‌వేగాస్ వంటి నగరాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ప్రపంచ స్థాయి సమావేశాలు, వేడుకలు నగరంలో జరుగుతాయి. తారామతి బారాదరి, శిల్పారామంలో రాక్ గార్డెన్, మౌంటెన్ హైట్స్ వంటి నగరంలోని చాలా వరకు ప్రభుత్వ వేదికలు నిర్వహణ సరిగా లేక పాడవుతున్నాయి. వీటిని రాయితీల రూపంలో టీసీఈఐకు అందజేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పరిశ్రమకు హెల్ప్ అవుతుంది. టీసీఐఈ పరిశ్రమ ఏటా 17–18 శాతం వృద్ధి చెందుతుంది. ఈ రంగంలోని కారి్మకులకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందజేయాలి.