CM KCR Corona Positive: యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్‌, ఫామ్‌హౌస్‌లో చికిత్స - Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

Apr 19 2021 7:14 PM | Updated on Apr 20 2021 4:08 AM

Telangana CM KCR Tested Covid Posirtive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు కరోనా సోకింది. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారాయన. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉ‍న్నాయని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన సాగర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా  కరోనా సోకిన సంగతి విధితమే.

ఇక  తెలంగాణలో  గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల వ్యవధిలో  14 మంది వైర‌స్ బారినపడి చనిపోయారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మ‌ర‌ణించ‌గా, 3,14,441 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement