న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంలో 1200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (mphs) ఊరట దక్కింది. మల్లీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2013లో ఉమ్మడి ఏపీలో కారుణ్య నియామకాల కింద 1200మంది ఎంపీహెచ్‌ఎస్‌లు ఉద్యోగం పొందారు. అయితే, ఆ నియామక ప్రక్రియను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఆ 1200మందిని కారుణ్య నియామకం కింద నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు 1200మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాల్ని రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయ స్థానం .. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వారి ఉద్యోగాల్లో కొనసాగించవచ్చని కీలక తీర్పును వెలువరించింది.


