
సాక్షి, నిజామాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్, జూనియర్ మెడికోలు ఘర్షణకు దిగారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగి ప్రశ్నించినందుకు రాహుల్‌ను సీనియర్లు చితకబాదారు. గాయాలపాలైన రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆసుపత్రిలో అర్ధరాత్రి వరకు పంచాయితీ జరిగింది. బాధితుడు.. కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు.. ర్యాగింగ్ విషయం బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.