
వాగ్దేవి ల్యాబ్స్‌లో సీజ్ చేసిన శాంపిల్స్ తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
మనీలాండరింగ్ కోణంలో ఈడీ వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాల కేసును మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మత్తు పదార్థాల కట్టడిలో దేశవ్యాప్తంగా కీలక ఏజెన్సీ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించింది.
చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలోనూ ఎన్‌సీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఎండీ డ్రగ్స్ పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జాతీయ, అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లు ఇందులో ఉన్నట్టుగా దర్యాప్తు ఏజెన్సీలు భావిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీబీ అధికారుల దర్యాప్తు సైతం కీలకంగా మారనుంది.
కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ పదేళ్లుగా ఎండీ డ్రగ్ తయారు చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. విదేశీ ఏజెంట్లు సైతం శ్రీనివాస్ విజయ్‌తో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగే అవకాశముంది. ఇందులో కొంత హవాలా రూపంలో కూడా నగదు మార్పిడి జరిగే అవకాశం ఉన్నందున మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
నిందితులను కస్టడీకి తీసుకుంటేనే....
డ్రగ్స్ తయారీ, చేరవేతలో శ్రీనివాస్‌విజయ్ వోలేటి, తానాజీ పండరీనాథ్ పటా్వరీ ఎంతో పక్కాగా వ్యవహరించేవారిని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోసం ముంబై నుంచి తరచూ ఫజల్, ముస్తాఫా చర్లపల్లికి వచ్చేవారని తెలిసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను మహారాష్ట్ర పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన 13 మంది నిందితులు జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 15 వరకు జ్యుడీíÙయల్ రిమాండ్ ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకోనున్నారు. వారిని విచారిస్తే మరికొన్ని కొత్తకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
బాక్స్ ఐటమ్ ముంబైలో తెలంగాణ ‘ఈగల్’ఆపరేషన్ ?
ముంబైలో తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) పోలీసులు ఇటీవల సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల పట్టుబడిన నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచి్చన డబ్బును ముంబై మీదుగా నైజీరియా సహా విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే డబ్బు తరలిస్తున్న 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇందులో పూణే సహా నైజీరియన్లు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. అయితే ముంబైలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను ఈగల్ అధికారులు ధ్రువీకరించలేదు.