
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
కాచిగూడలో కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. టపాసులు పేలుస్తుండగా నిప్పు రవ్వలు పడి బెలూన్లు పేలిపోయాయి. భయంతో పరుగెత్తుతుండగా తోపులాట జరిగిఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మరొకొందరు కార్యకర్తలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే, కార్యకర్తలకు స్వల్పగాయలు అయ్యాయి.