Live Updates
కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
తుది విడుత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా
- తుది విడుత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా
- కాంగ్రెస్-528
- బీఆర్ఎస్- 183
- బీజేపీ - 43
- ఇతరులు-124పైగా సర్పంచ్‌ల విజయం
- వార్డులలోనూ కొనసాగుతున్న కాంగ్రెస్ హవా
కొనసాగుతున్న కౌంటింగ్
4159 స్థానాలకు పోలింగ్
- 531 స్థాన్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం
- 186 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయం
- 43 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల విజయం
- 125 స్థానాల్లో ఇతరుల విజయం
సిద్దిపేట జిల్లాలో
సిద్ధిపేట జిల్లాలో భారీగా నమోదైన పోలింగ్ శాతం
చేర్యాల - 81.99%
మద్దూర్ - 87.53%
కొమురవెళ్లి - 85.79%
దూల్మిట్ట - 89.34%.
ప్రారంభమైన కౌంటింగ్ పక్రియ
- తెలంగాణలో తుది విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్
- ప్రారంభమైన కౌంటింగ్ పక్రియ
మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్
- పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం.
- మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్.
- మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్న అధికారులు.
- కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీజీపీ.
మూడో విడతలో జిల్లాలో 85.94 శాతం పోలింగ్ నమోదు
- యాదాద్రి భువనగిరి జిల్లా ముగిసిన పంచాయతీ ఎన్నికల సమరం
- మూడో విడతలో జిల్లాలో 85.94 శాతం పోలింగ్ నమోదు
కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
- తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- మొదట వార్డు.. ఆ తర్వాతే సర్పంచ్ స్థానాలకు లెక్కింపు
- తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- ఆ తర్వాతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపు
- సాయంత్రంకల్లా వెలువడనున్న ఫలితాలు
- సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రికల్లా ఫలితాలు
- తెలంగాణలో ముగిసిన పంచాయితీ ఎన్నికల పోలింగ్
- ఒంటి గంట దాకా నడిచిన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్
- 1గం. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
- 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ
- మరికాసేపట్లో ఓటింగ్ శాతంపై రానున్న స్పష్టత
ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు
ములుగు జిల్లా
- ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు.
- వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు.
- అల్వాల అపర్ణ అక్కడికక్కడే మృతి, భర్త దేవేందర్‌కు గాయాలు.
- భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న దేవేందర్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని గురిజాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తిరిగి భూపాలపల్లి వెళ్తుండగా ప్రమాదం.
- మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు.
రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి చేరుకున్న సీఎస్, డీజీపీ
మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి సీఎస్, డీజీపీ చేరుకున్నారు. డీజీపీ మాట్లాడుతూ..
- ఎన్నికలు సజావుగా జరుగున్నాయి.
- రేపు కూడా మా బలగాలు కొనసాగుతాయి.
- ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 59.39పోలింగ్ నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లా
- మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11గంటల వరకు 56.58% పోలింగ్ నమోదు
ఖమ్మం జిల్లా
పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో ఉద్రిక్తత.
పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మధ్య వాగ్వాదంతో చెలరేగిన వివాదం.
ఇరు వర్గాల వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
రంగారెడ్డి జిల్లా
- మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత.
- కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం.
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.
- పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.
నిజమాబాద్
జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్.
11 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ నమోదు.
కామారెడ్డి
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. 11 గంటల వరకు 56.71
కరీంనగర్
కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 52.82శాతం
పెద్దపల్లి 57.22 శాతం
కరీంనగర్ 55.67 శాతం
రాజన్న సిరిసిల్ల 46.90 శాతం
రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్
11 గంటల వరుకు రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్ జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
ఖమ్మం జిల్లా
- ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.
- గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్.
- గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.
- తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు.
- కల్లూరు మండలం చెన్నూరులో ఓ ఇంటర్నెట్ దుకాణంలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.
- 95000 నగదు ను సీజ్ చేసి నిర్వహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
- సత్తుపల్లి మండలం బెతుపల్లి గ్రామం లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుకు గురైన సత్యనారాయణ(65) అనే వృద్ధుడు.
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ
జగిత్యాల జిల్లా
- గొల్లపల్లి మండలకేంద్రంలో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం
జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం
అలంపూర్ 29.00 శాతం
మానవపాడు 23.73 శాతం
ఉండవెల్లి 28.81 శాతం
ఇటిక్యాల 26.81 శాతం
ఎర్రవల్లి 33.16 శాతం
కరీంనగర్
కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 21.74
- పెద్దపల్లి 22.50 శాతం
- కరీంనగర్ 20.66 శాతం
- రాజన్న సిరిసిల్ల 18.69 శాతం
నాగర్ కర్నూలు
నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 25.70శాతం పోలింగ్ నమోదు.
మండలాల వారీగా.. అచ్చంపేట... 27.45%
అమ్రాబాద్...25.26%
బల్మూర్... 22.04
లింగాల.. 27.16
ఉప్పునుంతల ...25.80
పదార....25.29
చారకోండ ....27.73
పోలింగ్ నిలిపివేసిన అధికారులు
పెద్దపల్లి జిల్లా
ఓదెల మండలం హరిపురంలో ఆరవ వార్డు పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ నిలిపివేసిన అధికారులు.
పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌కు బదులు వార్డు సభ్యుడి కోసం బరిలోకి దిగిన అభ్యర్థి కూర్చోవడంతో గ్రామస్థుల ఆందోళన.
పోలింగ్ నిలిపేసి అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది.
9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదు
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు
9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్.
వికారాబాద్
వికారాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.86 శాతం పోలింగ్ నమోదు
పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా
నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్, దర్శించర్ల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం
నల్లగొండ జిల్లా
- మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్ నమోదు
నిజామాబాద్ జిల్లా
- తొలి రెండు గంటల్లో 23.35 శాతం పోలింగ్ నమోదు.
- మెండోరాలో అత్యధికంగా 28.11 శాతం
- వేల్పూరులో అత్యల్పంగా 17.88
కామారెడ్డి జిల్లా జిల్లాలో తొలి రెండు గంటల్లో 21.49 శాతం పోలింగ్ నమోదు. - అత్యధికంగా బిచ్కుందలో 27.70
- అత్యల్పంగా మద్నూర్ లో 14.70 పోలింగ్ నమోదు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్
వరంగల్ జిల్లా
నర్సంపేట, నెక్కొండ. చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన ఆకుపచ్చని హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద.
నిజామాబాద్ జిల్లా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్ నమోదు.
సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం
- నారాయణఖేడ్ 24.08%
- కంగ్టి 30.01%
- మానూర్ 25.05%
- నాగల్ గిద్ద 26.02%
- సిర్గాపూర్ 28.04%
- కల్హేర్ 26.7%
- నిజాంపేట్ 20.03%
ఓటేసేందుకు లండన్ నుంచి వచ్చి..
- అబ్దుల్లాపూర్‌మెట్ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన
- తన స్వగ్రామంలో ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చిన విద్యార్థి
- ఓటు హక్కు వినియోగించుకున్న లవన్ కుమార్
ఉదయం 9 గంటలు.. 24 పోలింగ్ శాతం నమోదు
- తెలంగాణ లో కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- 3,752 పంచాయతీలు, 28, 410 వార్డులకు కొనసాగుతున్న పోలింగ్
- ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పోలింగ్ శాతం నమోదు
- మధ్యాహ్నాం 1గం. దాకా పోలింగ్
- 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్
- సాయంత్రం కల్లా వెలువడనున్న ఫలితాలు
- వీలైతే ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నికలు.. కుదరకుంటే రేపే!
సూర్యాపేటలో మండలాల వారీగా పోల్ అయిన వివరాలు
సూర్యాపేట జిల్లా
- సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోల్ అయిన వివరాలు శాతంలలో చింతలపాలెం - 26.84 %
- గరిడేపల్లి - 25.18 %
- హుజూర్నగర్ - 20.66 %
- మట్టంపల్లి - 27.74 %
- మేళ్లచెర్వు - 23.48 %
- నేరేడుచర్ల - 21.02 %
- పాలకవీడు - 26.70 %
- జిల్లాలో పోలింగ్ సరాసరి.. 24.83 %
నందిపేటలో పోటెత్తిన ఓటర్లు
నిజామాబాద్
- నందిపేటలో పోటెత్తిన ఓటర్లు.
- ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు.
- నందిపేట పోలింగ్ కేంద్రంలో 10 వేలకు పైగా ఓటర్లు.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బారులు తీరిన ఓటర్లు.
400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు
- ఓదెల మండల కేంద్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 100 మీటర్ల అవతల పెద్ద ఎత్తున 400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు.
- అభ్యర్థుల మద్దతుదారులు 144 సెక్షన్ ఉల్లంఘించారని ఆరోపణ.
- ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను వెనుకకు పంపిస్తున్న గోదావరిఖని ఏసిపి రమేష్.
ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు
మహబూబ్‌నగర్ జిల్లా
మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్చర్ల బాలానగర్ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థలోఎన్నికల సందర్భంగా ఉప్పునుంతల మండలం లోని పలు గ్రామాలలో మొదలైన పోలింగ్.
వనపర్తి జిల్లా
పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలలో మొదలైన మూడో విడత పోలింగ్.
నారాయణపేట జిల్లా
మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్.
తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు.
జోగులాంబ గద్వాల జిల్లా
అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు,ఎర్రవల్లి,ఇటిక్యాల, ఉండవెల్లి,అలంపూర్ మండలాలలో మూడో విడత ఎన్నికల్లో 75 గ్రామ పంచాయతీలగాను 7 గ్రామపంచాయతీలో ఏకగ్రీవం కాగా మిగిలిన 68 గ్రామపంచాయతీలో కొనసాగుతున్న పోలింగ్.
ప్రశాంతంగా జరుగుతున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
మూడు మండలాల్లో కలిపి మొత్తం 82 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
మిగతా 71 గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలు
పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
కొనసాగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా
- జిల్లాలో కొనసాగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.
- సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మరియు గంభీరావుపేట మండలాల్లో పోలింగ్.
వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
ఉమ్మడి వరంగల్ జిల్లా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం.
530 సర్పంచ్ స్థానాలకు బరిలో 1751 మంది అభ్యర్థులు.
4101 వార్డు స్థానాలకు బరిలో నిలిచిన 9572 మంది అభ్యర్థులు.
116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భారీగా పోలీసుల మోహరింపు.
వరంగల్ జిల్లాలో 102 సర్పంచ్, 809 వార్డు స్థానాలకు ఎన్నికలు.
హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్, 563 వార్డు స్థానాలకు పోలింగ్.
ములుగు జిల్లాలో 45 సర్పంచ్, 329 వార్డు స్థానాలకు పోలింగ్.
భూపాలపల్లి జిల్లాలో 77 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు పోలింగ్.
జనగామ జిల్లాలో 88 సర్పంచ్, 692 వార్డు స్థానాలకు పోలింగ్.
మహబూబాబాద్ జిల్లాలో 150 సర్పంచ్, 1138 వార్డు స్థానాలకు పోలింగ్.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు
జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, బుగ్గారం,గొల్లపల్లి,వెల్గటూర్,ఎండపల్లి,పెగడపల్లి మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న తుది విడత పోలింగ్.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు
సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
ఉదయం చలి, మంచు కురుస్తుండడంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్
కరీంనగర్ జిల్లా
జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ తుది విడత పోలింగ్.
ఉదయం చలి, మంచు కురుస్తుండడంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.
భారీ బందోబస్తు మధ్య గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్న పోలీసులు.
వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఇప్పుడిప్పుడే తరలివస్తున్న ఓటర్లు.
సైదాపూర్ హుజురాబాద్ మండలాల్లో కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్
వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య.
మూడో విడతలో భాగంగా వనపర్తి జిల్లాలో 80 సర్పంచ్ స్థానాలకు, 702 వార్డులకు పోలింగ్.
యాదాద్రిలో ఆరు మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు
యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు
124 సర్పంచ్, 1086 వార్డులకు నోటిఫికేషన్
10 సర్పంచ్, 93 వార్డులు ఏకగ్రీవం
114 సర్పంచ్, 993 వార్డులకు ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన మూడవవిడత పంచాయతీ ఎన్నికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇల్లందు ,టేకులపల్లి ,గుండాల ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల్లో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్.
- జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన మూడవవిడత పంచాయతీ ఎన్నికలు.
- 155 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు.
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,75,074 మంది ఓటర్లు.
- ఉదయం 7 గంటలకు ఏజెంట్ల, అబ్జర్వల సమక్షంలో ప్రారంభమైన పోలింగ్.
- జిల్లావ్యాప్తంగా 1330 వార్డ్ మెంబర్లు.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు.
ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత ఎన్నిక
ఖమ్మం
సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.
5 మండలాలలో మొత్తం ఓటర్లు - 1,83,734 మంది
మొత్తం సర్పంచ్ అభ్యర్థులు - 307
వైరా నియోజకవర్గంలోని ఏనుకూరు మండలాల్లో ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మండలాలలో మొత్తం ఓటర్లు -21550మంది
సూర్యాపేట జిల్లాలో 22 సర్పంచ్, 257 వార్డులు ఏకగ్రీవం
సూర్యాపేట జిల్లా
- సూర్యాపేట జిల్లాలో 7 మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు
- 146 పంచాయతీలు, 1318 వార్డులకు నోటిఫికేషన్
- 22 సర్పంచ్, 257 వార్డులు ఏకగ్రీవం
- 124 సర్పంచ్, 1061 వార్డులకు ఎన్నికలు
- ఎన్నికల బరిలో మొత్తం 2908 మంది అభ్యర్థులు
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
నల్లగొండ జిల్లా
- నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు
- 269 సర్పంచ్, 2206 వార్డులకు నోటిఫికేషన్
- 42 సర్పంచ్, 596 వార్డులు ఏకగ్రీవం
- 227 సర్పంచ్, 1603 వార్డులకు ఎన్నికలు
- 1610 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
సమస్యాత్మకమైన కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
ఖమ్మం
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.
సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, వైరా నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న మూడవ విడత ఎన్నికలు.
సమస్యాత్మకమైన కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
రంగారెడ్డి
మూడో విడతలో 163 గ్రామపంచాయతీలకు ఎన్నికలు
163 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 559 మంది అభ్యర్థుల పోటీ
జిల్లాలో మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ జారీ
మూడో విడతలో ఏకగ్రీవమైన 10 పంచాయతీలు
కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ ఎన్నిక వాయిదా
మూడో విడతలో 1448 వార్డులకు ఎన్నికలు, పోటీలో 4091 మంది అభ్యర్థులు
మూడో విడతలో 3500 మంది సిబ్బందితో పోలింగ్
మూడో విడతలో పోలింగ్ జరుగుతున్న మండలాలు: అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, కందుకూరు, మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 88.67 శాతం పోలింగ్ నమోదు రంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 85.3 శాతం పోలింగ్ నమోదు.
వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, చౌడపూర్, పూడూరు మండలాల్లో ఎన్నికలు
మూడో విడతలో నేడు 139 గ్రామపంచాయతీలకు ఎన్నికలు
139 గ్రామపంచాయతీల్లో సర్పంచి కోసం 400 మంది అభ్యర్థుల పోటీ
జిల్లాలో మూడో విడతలో 175 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ జారీ
జిల్లాలో మూడో విడతలో ఏకగ్రీవమైన 18 పంచాయతీలు
మూడో విడతలో 1034 వార్డులకు ఎన్నికలు, 2588 మంది అభ్యర్థుల పోటీ
వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో 81.21 శాతం పోలింగ్ నమోదు
వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 82.72 శాతం పోలింగ్ నమోదు
163 సర్పంచ్‌లలో 13 మంది ఏకగ్రీవం
సిద్దిపేట జిల్లా
9 మండలాల పరిధిలోని 163 సర్పంచ్‌లలో 13 మంది ఏకగ్రీవాలు అయ్యారు.
మిగిలిన 150 సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి..1432 వార్డులలో 243 వార్డులు ఏకగ్రీవం కాగా 1182 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి..
234 గ్రామపంచాయతీలలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
సంగారెడ్డి జిల్లా
జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 234 గ్రామపంచాయతీలలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
207 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.1960 వార్డులలో 422 ఏకగ్రీవాలు కాగా 1537 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి..
518 సర్పంచ్ 3939 వార్డులకు ఎన్నికలు
మెదక్ జిల్లా
- ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి విడతలో 518 సర్పంచ్ 3939 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
- మెదక్ జిల్లా మొత్తం సర్పంచ్ స్థానాలు 183.
- ఏకగ్రీవాలు అయిన సర్పంచ్‌లు 22.
- పోలింగ్ జరగనున్న గ్రామాలు 161.
- జిల్లాలో 1528 వార్డులకు గాను 308 వార్డులకు ఏకగ్రీవాలు కావడంతో 1220 వార్డ్ లకు పోలింగ్ జరగనుంది.
మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్‌కు నేటితో ముగింపు
కరీంనగర్ జిల్లా
- మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్‌కు నేటితో ముగింపు.
- మూడో విడతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 స్థానాలకు నోటిఫికేషన్.
- 22 ఏకగ్రీవం కావడంతో నేడు 386 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.
- ఉమ్మడి జిల్లాలోని జిల్లాల వారీగా చూస్తే మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకుగాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో నేడు 108 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.
- జగిత్యాల జిల్లాలో 119 గ్రామాలకు 6 ఏకగ్రీవం కావడంతో 113 స్థానాలకు జరుగుతున్న పోలింగ్.
- పెద్దపెల్లి జిల్లాలో 91 స్థానాలకు 6 ఏకగ్రీవం కావడంతో 85 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో నేడు 80 పంచాయితీలకు జరుగుతున్న పోలింగ్.
- నేటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం 1224 గ్రామపంచాయితీలకు ముగియనున్న ఎన్నికల ప్రక్రియ.
ఎస్టీ ఓటర్లు లేకపోవటంతో పోటీ చేసేందుకు దొరకని అభ్యర్దులు
మహబూబ్ నగర్
మూడో విడత ఉమ్మడి జిల్లాలో 28 మండలాల పరిధిలో 543 సర్పంచ్,4410 వార్డు సభ్యులకు ఎన్నికలు
సర్పంచ్ పదవులకు 2131 మంది,వార్డు సభ్యులకు11236 మంది పోటీ
ఓటు హక్కు వినియోగించుకోనున్న 7,95,788 మంది ఓటర్లు
నల్లమలలోని ఐదు గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్దులు
ఎస్టీ ఓటర్లు లేకపోవటంతో పోటీ చేసేందుకు దొరకని అభ్యర్దులు
చారకొండ మండలం ఎర్రవల్లిలో రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్దులు
మొదలైన మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
మొదలైన మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయితీలు 333
20 మండలాలలో ఎన్నికలు
ఏకగ్రీవం అయిన జీపీలు 45
పోలింగ్ జరుగుతున్న పంచాయితీలు 288
పోటీలో ఉన్న అభ్యర్థులు 1024
పోలింగ్ కేంద్రాలు 2900
వెబ్ కాస్టింగ్ సెంటర్లు 104
తెలంగాణలో నేడు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు.
బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది.
మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


