
కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెడతాం
సచివాలయంలో కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని న్యూయార్క్‌ను పోలిన రీతిలో తీర్చిదిద్దాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో ‘కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్’సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందం భేటీ అయింది. సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచ నగరాల స్థాయిలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యంగా ïసీఎం రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గం విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందన్నారు.
దేశంలో వేగంగా హైదరాబాద్ వృద్ధి
గ్లోబల్ సిటీగా హైదరాబాద్ వృద్ది చెందుతున్న తీరు, వివిధ రంగాల్లో విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా వృద్ది చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ భేటీ సందర్భంగా వెల్లడించింది. గత ఆరు నెలల్లో రియలీ్ట, లీజింగ్, ఆఫీస్ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్‌లో హైదరాబాద్ నగరం గణనీయమైన వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోమారు వెల్లడయ్యే తమ నివేదిక తాజా నివేదిక జూలై నెలాఖరులో వెలువడుతుందని ప్రతినిధి బృందం వెల్లడించింది.
లాక్‌హీడ్ మారి్టన్ డైరెక్టర్ భేటీ
ఏరోస్పేస్ సాంకేతికత దిగ్గజ సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్’ఇండియా డైరెక్టర్ (ఏరోనాటిక్స్) మైఖేల్ ఫెర్నాండెజ్ సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సచివాల యంలో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.