రేపు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ఈటల

Etela Rajender To Join BJP Tomorrow In Presence Of JP Nadda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, మాజీ హుజూరాబాద్‌ శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌ మరికొద్ది గంటల్లో కమల తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన రేపు ఉదయం 11:30కి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన రేపు ఉదయం తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌  జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, దేవరయాంజల్‌ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. ఈ క్రమంలో అతను సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. అయితే వీటన్నిటికీ ఫుల్‌ స్టాప్‌ పెడుతూ.. ఆయన రేపు ఉదయం బీజేపీలో చేరనున్నారు.  
చదవండి: ‘ఈటల కోసం ప్రచారం చేస్తా’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top