మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌..! | Coronavirus Red Alert in Mahabubnagar | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌..!

Jul 25 2020 1:00 PM | Updated on Jul 25 2020 6:40 PM

Coronavirus Red Alert in Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌: జిల్లాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ వారంలో ఊహించని స్థాయిలో కరోనా కేసులు రావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. ఈనెల 20న 55 కేసు లు, 22న 31 కేసులు, 23న 25 కేసులు తాజాగా శుక్రవారం 77మంది కరోనా బారినపడ్డారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో 188 మందికి కోవిడ్‌ వైరస్‌ సోకడం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 478పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని వీర న్నపేటకు చెందిన మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా తో మృతి చెందింది. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 18కి చేరాయి. జడ్చర్ల పట్టణంలోనూ అధిక సంఖ్యలో కేసులు రావడం జిల్లా అధికారులను టెన్షన్‌ పెడుతుంది.   

జిల్లాలో శుక్రవారం వచ్చిన 77 పాజిటివ్‌ కేసులలో 50 కేసులు మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో, 22 జడ్చర్ల పట్టణంలోనే నమోదయ్యాయి. పాత పాలమూరులో తల్లి, కొడుకు ఇద్దరికి కరోనా వచ్చింది. క్రిస్టియన్‌ పల్లిలోని భవానీనగర్‌లో ఒకే కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు. పాన్‌చౌరస్తాలో ఒకరు, తిమ్మాసనిపల్లిలో ఒకరు, హనుమాన్‌నగర్‌లో ఓ వృద్ధుడికి, పద్మావతి కాలనీలో ఓ మహిళకు వైరస్‌ సోకింది. న్యూ ప్రేమ్‌నగర్‌లో వేర్వేరు ఇళ్లలో ఇద్దరు మహిళలు, ఇద్దరు వ్యక్తులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. శ్రీనివాస కాలనీ పార్క్‌ దగ్గర, సుభాష్‌నగర్, వీరన్నపేట, టీచర్స్‌ కాలనీల్లో ఒక్కొక్కరు ఈ వైరస్‌ బారినపడ్డారు. క్రిస్టియన్‌ కాలనీలో ఒకే ఇంట్లో ఇద్దరు అమ్మాయిలకు కరోనా సోకింది. క్రిస్టియన్‌ కాలనీలో మరో వ్యక్తికి సైతం కరోనా వచ్చింది. పాత పాలమూరులో ఒకే కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌ రాగా, వివేకానంద నగర్, వీరన్నపేట, న్యూగంజ్‌లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

న్యూమోతీనగర్‌లో ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. సుభాష్‌నగర్‌లో ఓ యువకుడికి, బ్రహ్మణవాడిలో ఒకరికి, హాబీబ్‌నగర్‌లో ఒకరు, మర్లులో ముగ్గురు, బీకే రెడ్డి కాలనీలో ఇద్దరికి, క్రిస్టియన్‌ పల్లిలో ఒకరు, మదీనా మజీద్‌ ఏరియాలో ఒకరు, పద్మావతి కాలనీలో ఓ మహిళ, భగీరథ కాలనీలో ఒకరు, షాషాబ్‌గుట్టలో ఒకరు, వీరన్నపేటలో ఒకరు, లక్ష్మీనగర్‌ కాలనీలో ఒకరు, హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఒకరికి, న్యూగంజ్‌లో ఒకరు, బాలాజీనగర్‌లో ఒకరు, పెద్దదర్పల్లిలో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది. గండేడ్‌ మండలం నంచర్లలో ఒకరికి వచ్చింది. నవాబ్‌పేట మండలంలోని జంగమయ్యపల్లిలో ఒకరికి వచ్చింది. భూత్పూర్‌ మండలం మద్దిగట్లలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ సోకింది.

జడ్చర్లలోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే ఒకే కుటుంబంలో ఇద్దరు, క్లబ్‌ రోడ్‌లో ఒకరి, విజయ్‌నగర్‌ కాలనీలో ఒకరు, వెంకటేశ్వర కాలనీలో ఒకరు, ప్రశాంత్‌నగర్‌లో ఒకరికి వచ్చింది. ఇక గౌరీశంకర్‌ కాలనీలో ఒకే ఇంట్లో ముగ్గురికి కోవిడ్‌ వచ్చింది. గౌరీ శంకర్‌ కాలనీలో మరో వ్యక్తి, లక్ష్మీనగర్‌ కాలనీలో ఒకరికి, బాదేపల్లిలోని పద్మావతికాలనీలో ఒకరికి, బాదేపల్లిలో ఒకరు కరోనా బారినపడ్డారు. విశ్వనాథ్‌కాలనీలో ఒకరు, రంగరావు తోట, సత్యనారాయణ దేవాలయం సమీపంలో ఒకరికి, బాదేపల్లిలోని చైతన్యనగర్‌లో ఒకరికి, నేతాజీ చౌక్‌లో ఇద్దరికి రంగరావు తోట, బాలాజీనగర్‌లో ఒక్కొక్కరు కోవిడ్‌ బారినపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement