భారీగా కీచైన్లు, కూపన్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీగా కీచైన్లు, కూపన్లు స్వాధీనం

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

తిరువళ్లూరు: డీఎంకే తరఫున ఓటర్లకు పంచడానికి కంటైనర్‌ లారీలో తరలిస్తున్న కూపన్‌లు, కీచైన్‌, క్యాలెండర్లు, ముఖ్యమంత్రి ఫొటోతో కూడిన గిఫ్ట్‌బాక్సులను స్పెషల్‌టీమ్‌ స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని నిరోధించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పట్రపెరంబదూరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆసమయంలో చైన్నెలో కంటైనర్‌లో తరలిస్తున్న గిఫ్ట్‌బాక్సులు, కూపన్లు, కీచైన్లు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని తాలుకా కార్యాలయానికి తరలించారు. కాగా బాక్సులోని వస్తువులను తెరిచి చూపించాలని అన్నాడీఎంకే నేతలు కోరడంతో డీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో తాలుకా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement