అంతర్జాతీయ శిక్షణకు మార్గం సుగుమం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ శిక్షణకు మార్గం సుగుమం

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● మలేషియాతో చైన్నె అమృత కీలక ఒప్పందం

సాక్షి, చైన్నె: విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ మార్గాన్ని సుగమం చేస్తూ మలేషియా వర్సిటీతో చైన్నె అమృత ఏవియేషన్‌ కాలేజీకి సంబంధించిన కీలక ఒప్పందంచేసుకుంది. బుధవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందాలపై చైన్నె అమృత చైర్మన్‌ భూమినాథన్‌, మలేషియా వర్సిటీ డీన్‌ అబ్దుల్లా అన్వర్‌లు సంతకాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, మలేషియాలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ జరిగిన ఈ ఒప్పందంతో వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు వివరించారు. ఈ ఒప్పందం ద్వారా విమానయాన రంగంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేరుగా తన విద్యార్థులకు అందించే మార్గం సుగమమైనట్టు తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా చైన్నెలో నాలుగు రోజుల అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని గుర్తు చేవారు. ఇందులో ఏవియేషన్‌ 4.ఓ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , విమానాశ్రయ నిర్వహణ, అత్యాధునిక సాంకేతికతలపై చర్చించామన్నారు. అలాగే, ఏవియేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ (3 ఏళ్లు), బీఎస్సీ ఎయిర్‌ ట్రానన్స్‌పోర్ట్‌ , డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ టూరిజం కోర్సులను అందిస్తామని వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం, విద్యార్థులు మొదటి రెండేళ్లు చైన్నె క్యాంపస్‌లో చదువుతారని, . చివరి సంవత్సరంలో ఆరు నెలల పాటు మలేషియాలో శిక్షణ పొందుతారని ప్రకటించారు.ఏవియేషన్‌ రంగంలో అత్యంత విలువైన ఐఏటీఏ సర్టిఫికేషన్‌ కోసం చైన్నె అమృతలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement