పళణి సుడిగాలి ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పళణి సుడిగాలి ప్రచారం

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి బుధవారం చైన్నెలో ఆగమేఘాలపై ప్రచారంలో దూసుకెళ్లారు. టీనగర్‌, సైదా పేట,విరుగంబాక్కం, అన్నానగర్‌, విల్లివాక్కం, తదితర నియోజకవర్గాలలో విస్తృతంగాపర్యటించారు. తమ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రజల్ని కలిసి ఓట్ల వేటలో పడ్డారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో దూసుకెళ్లిన ఆయన అక్కడక్కడ కూడళ్లలో ప్రసంగించారు. డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అవినీతికుటుంబ పాలన అంతం లక్ష్యంగా అన్నాడీఎంకే అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అలాగే,సైదా పేటలో మిత్ర పక్షం అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థి సెంతమిళన్‌కు మద్దతుగా కుక్కర్‌ చిహ్నంలో ఓటు వేయాలని కోరారు. మిగిలిన చోట్ల తమ అభ్యర్థులకు రెండాకు చిహ్నంలో ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement