ప్రశాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా..

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

తమిళసినిమా: టాప్‌స్టార్‌ ప్రశాంత్‌ పుట్టిన రోజు వేడుకలు సోమవారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నిర్మాత కలైపులి ఎస్‌.ధాను ,టీ.శివ, కథిరేశన్‌, ఫైవ్‌స్టార్‌ కథిరేశన్‌, జీవీ.ప్రకాశ్‌కుమార్‌, ఆర్‌కే.సురేశ్‌, నటి దేవయాని నటుడు విశాల్‌, దర్శకుడు వెట్రిమారన్‌, దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌, చరణ్‌ తదితరులు పాల్గొని ప్రశాంత్‌కు శుభాకాంక్షలు అందించారు. అదేవిధంగా ప్రశాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ను వెల్లడించారు. ఈ చిత్రానికి రంజన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. స్టార్‌ మూవీస్‌ పతాకంపై ప్రీతీ త్యాగరాజన్‌ సమర్పణలో శాంతి త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా నిర్మాత కథిరేశన్‌ వారుసుడు హరిని, నటి దేవయాని వారసురాలు ప్రియాంకను యువ జంటగా పరిచయం చేస్తున్నారు. కాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, రవియాదవ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉంది. కాగా ప్రశాంత్‌ పుట్టిన రోజున ఈ విషయాన్ని దర్శకుడు త్యాగరాజన్‌ వెల్లడించారు. ఇది చాలా సంతోషకరమైన రోజు అని నటుడు ప్రశాంత్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు శుభాకాంక్షలు అందించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విశాల్‌ మాట్లాడుతూ నటుడు ప్రశాంత్‌ చూసి తాను చాలా ఆసూయపడేవాడినని అన్నారు. తన చిన్నతనంలోనే ఆయన టాప్‌స్టార్‌గా రాణించారని, చాలా స్మార్ట్‌గా ఉండడంతో అమ్మాయిలు ఆయన్ని ఎక్కువగా ఇష్టపడేవారని అన్నారు. అదే విధంగా ఈ చిత్రం ద్వారా యువ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న నిర్మాత కథిరేశన్‌ వారసుడు హరి, నటి దేవయాని వారసురాలు ప్రియాంకలకు శుఽభాకాంక్షలు తెలిపారు.

రంజన్‌ చిత్ర యూనిట్‌తో సినీ ప్రముఖులు

Advertisement
 
Advertisement
Advertisement