బస్సు, కారు ఢీ | - | Sakshi
Sakshi News home page

బస్సు, కారు ఢీ

Mar 29 2026 7:15 AM | Updated on Mar 29 2026 7:15 AM

–దంపతులు మృతి

తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో కారు, ప్రభుత్వ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాధంలో భార్య దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు బాలాజీ నగర్‌ ప్రాంతానికి చెందిన రవిచంద్రన్‌ (63), ఇతని భార్య గీత (56). వీరిద్దరు తిరువళ్లూరులోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. దర్శనానంతరం కారులో తిరుగు పయనమయ్యారు. వేపంబట్టు, సెవ్వాపేట మధ్య వెళుతుండగా అదుపుతప్పి కారు, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాధంలో గీత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రవిచంద్రన్‌ను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. సెవ్వాపేట పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

మృతి చెందిన గీత, రవిచంద్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement