వేలూరు: వేలూరు జిల్లా పిల్లయార్‌కుప్పం గ్రామంలోని ఓలైకన్ను వినాయకుడి ఆలయ కుంబాభిషేకాన్ని పురస్కరించుకొని 48 రోజుల అనంతరం మండల అభిషేక పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శివాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామి వారికి ఆచార స్నానం, పుష్పాలంకరణలు, ఆరాధన పూజలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని స్వామివారి ముందు యాగ గుండం ఏర్పాటు చేసి వాటి ముందు కలశ నీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలస నీటిని స్వామివారితో పాటు భక్తులపై చల్లి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ విజయన్, ఆలయ కమిటీ సభ్యులు అన్నాదురై, పురుషోత్తమన్, పరుశురామన్, శేఖర్ పాల్గొన్నారు.


