ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలపై చర్చ | - | Sakshi
Sakshi News home page

ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలపై చర్చ

Mar 29 2026 7:15 AM | Updated on Mar 29 2026 7:15 AM

సాక్షి, చైన్నె : తమిళనాడు కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేదంటూ కరూర్‌ ఎంపీ జ్యోతిమణి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనం సృష్టించాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ 28 సీట్లు కేటాయించారు. నియోజకవర్గాల ఎంపికలో సైతం జాప్యం తప్పలేదు. తాజాగా అభ్యర్థుల ఎంపిక ఢిల్లీకి చేరింది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌లో బయలు దేరిన అసంతృప్తి అన్నది ఎక్కడ కూటమికి సంకటం అవుతోందో అన్న చర్చ ఊపందుకుంది. అగ్రనేతలతో చర్చించే సీట్లు, నియోజకవర్గాల ఎంపిక కాంగ్రెస్‌లో జరిగితే, పారదర్శకత లేదని, అభ్యర్థుల ఎంపికలోనూ అనేక లొసుగులు ఉన్నాయని ఆరోపించడం గమనార్హం. గతంలో ఎంపీలతో చర్చించి అసెంబ్లీకి అభ్యర్థులను ఎంపిక చేశారని, ఇప్పుడు ఆపాదర్శకత ఎక్కడ అని ప్రశ్నించడం గమనార్హం. రాష్ట్రకాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఉండటంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఎదురు దాడికి దిగే పనిలో పడ్డారు.

ఎన్నికల బరిలో నటుడు మన్సూర్‌అలీఖాన్‌

సాక్షి, చైన్నె: తిరుచ్చి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారుతోంది. ఇండియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన ప్రముఖ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ఈసారి లాల్గుడి నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. తిరుచ్చిలోని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మన్సూర్‌ అలీ ఖాన్‌ శనివారం ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాను తిరుచ్చి గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉంది. నా ప్రసంగ శైలి, సామాన్యులతో మమేకమయ్యే విధంగా ప్రజలను ఆకట్టుకుంటోందన్నారు.ఓట్ల కోసం ప్రతి ఇంటికీ వెళ్తామన్నారు. రాష్ట్రంలో మత్తు నియంత్రణ లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు కూడా డ్రగ్స్‌ సులభంగా అందుబాటులో ఉంటున్నాయని, పోలీసు శాఖ దీనిని ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు.ఈ సందర్భంగా పొత్తుల గురించి స్పందిస్తూ, కూటమి నేతలను కలవడం కంటే, వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలవడానికే ఇష్టపడతా అంటూ చమత్కరించారు. తాను లాల్గుడి నుంచి పోటీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement