అవార్డుల వేడుక
జనవరి 25న
జ్యూరీ సభ్యులతో నిర్వాహకులు
తమిళసినిమా: అవార్డులు అనేవి కళాకారుల ప్రతిభకు గుర్తింపు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా వర్ధమాన కళాకారులకు ప్రోత్సాహకరం అవుతాయి. కాగా అలా ప్రతిభను గుర్తించి అవార్డులతో సత్కరించే వేడుక 2026 జనవరి 25న జరగనుంది. స్థానిక తేనాంపేటలోని కామరాజర్ ప్రాంగణం వేదిక కానుంది. గత 50 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు, నిర్మాత, దర్శకుడు, చిత్రా లక్ష్మణన్ టూరింగ్ టాకీస్ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వదంతులకు దూరంగా, వివాద రహిత చానల్‌గా పేరుగాంచిన టూరింగ్ టాకీస్ నిర్వాహకుడు చిత్రా లక్ష్మణన్ ఇప్పుడు ఆ ప్రేమ్ అండ్ ఫెమ్ పేరుతో 2025లో చిత్రాలకు నటీనటులకు, సాంకేతిక వర్గానికి చెందిన వారిలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి అవార్డులను గౌరవించే విధంగా ఈ అవార్డుల ప్రధాన నిర్వహించతలబెట్టారు. చిత్రా లక్ష్మణన్ ఈ అవార్డుల గురించి వివరిస్తూ తాము సినీ పరిశ్రమంలో ఉన్నామని, అందుకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఫ్రేమ్ అండ్ ఫేమ్ పేరుతో నిర్వహిస్తున్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఇదని చెప్పారు. ఈ అవార్డుల ఎంపిక దర్శక నటుడు కె.భాగ్యరాజ్ నేతృత్వంలో నటి కుష్బూసుందర్, ఇళవరసు, నిర్మాత మురళి రామస్వామి, టి శివ, దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, ఆర్వీ ఉదయ్‌కుమార్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన 50 కేటగిరీలో ఈ అవార్డులను ప్రదానం చేస్తామని చెప్పారు.
అవార్డుల వేడుక


