నిధుల కేటాయింపుపై రగడ
వేలూరు: వేలూరు కార్పొరేషన్ సమావేశంలో నిధుల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన డీఎంకే కార్పొరేటర్‌లు, మేయర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్‌తో పాటు మొదటి జోన్‌కు చెందిన మొత్తం 15 మంది కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చారు. వివరాలు.. గురువారం ఉదయం వేలూరు కార్పొరేషన్ సమావేశం మేయర్ సుజాత అద్యక్షతన జరిగింది. ముందుగా కార్పొరేటర్‌లకు బడ్జెట్‌కు సంబందించిన పుస్తకాన్ని అందజేశారు. అందులో గత సంవత్సరం కార్పొరేషన్ పరిధిలోని ఒకటివ జోన్‌కు సక్రమంగా కేటాయించక పోవడంతో పాటూ నిధులు కేటాయించినట్లు చిత్ర పటాలను ముద్రించారని కార్పొరేటర్‌లు ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని మొత్తం నాలుగు జోన్‌లలో తాను ఉన్న మొదటి జోన్‌లోని మొత్తం 15 వార్డుల్లో ఎటువంటి నిధులు కేటాయించక పోవడంతో తాము ఎటువంటి అభివృద్ధి పనులు చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో తమ 15 వార్డులకు చెందిన అఽధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌లు సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్తుతున్నామని చెప్పి బయటకు వచ్చారు. వీటిపై కమిషనర్ లక్ష్మణన్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా 49వ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్‌లో పలు కోట్ల రూపాయిలకు అభివృద్ధి పనులు జరిగినట్లు అందులో ప్రకటించారని, అయితే వీధులకు కనీసం రోడ్డు వేయలేదన్నారు. కొన్ని వీధులకు మాత్రం సిమెంట్ రోడ్డులు వేసి అనేక వీధులను వదిలి పెట్టారన్నారు. ఈ వివాదం పూర్తయి తర్వాత అన్నాడీఎంకే కార్పొరేటర్‌లు మాట్లాడుతుండగా సమావేశంలో ఉన్న డీఎంకే కార్పొరేటర్లు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ వీటిపై విచారణ జరిపి జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం సద్దు మనిగింది.


