 
															పెళ్లి రోజే వధువు మృతి
పళ్లిపట్టు: నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో పెను విషాదం మిగిల్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేట గ్రామానికి చెందిన రాము పళ్లిపట్టు ప్రభుత్వ మహోన్నత పాఠశాల టీచర్. అతని కుమారుడు మణి(27) ఇంజినీరు. అతనికి సమీప బంధువు తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామానికి చెందిన పాండురంగన్ కుమార్తె సంధ్య(21)తో ఇరు కుటుంబీకుల సమక్షంలో వివాహం నిశ్చయించారు. ఆమె బీకాం చదువుకుంది. బలిజకండ్రిగలోని టీటీడీ కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం రిసెప్షన్, శుక్రవారం ఉదయం కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వివాహ వేడుకల్లో భాగంగా అత్తిమాంజేరిపేటలోని వరుడి ఇంటికి చేరుకున్న నవ వధువు గురువారం ఉదయం స్నానం చేసేందుకు వెళ్లారు. ఎంత సేపటికీ స్నానపు గది నుంచి రాకపోవడంతో అనుమానించి, తలు పు తట్టి చూశారు. సమాధానం లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా స్నానపు గదిలో పడి ఉన్న వధువును చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే అక్కడున్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపా రు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. స్నానపు గదిలో నవ వధువు జారిపడి మృతి చెందినట్లు యువతి తండ్రి పాండురంగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
