వీటీఓఎల్‌లో ఐఐటీ మద్రాసు పురోగతి | - | Sakshi
Sakshi News home page

వీటీఓఎల్‌లో ఐఐటీ మద్రాసు పురోగతి

Oct 31 2025 7:47 AM | Updated on Oct 31 2025 7:47 AM

వీటీఓఎల్‌లో ఐఐటీ మద్రాసు పురోగతి

వీటీఓఎల్‌లో ఐఐటీ మద్రాసు పురోగతి

సాక్షి, చైన్నె: దేశ తదుపరి తరం విమాన సాంకేతికతను పెంచేందుకు, బలపరిచేందుకు హైబ్రీడ్‌ రాకెట్‌ థ్రస్టర్‌లతో వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌(వీటీఓఎల్‌)లో ఐఐటీ మద్రాసు పురోగతిని సాధించింది. హార్డ్‌వేర్‌ ఇన్‌ ది లూప్‌ సిమ్యులేషన్‌ అనే ప్రభావ వంతమైన పద్ధతిని ఉపయోగించి ఈ ప్రయోగాత్మక అధ్యయనం జరిగినట్టు గురువారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. ఇది సంక్లిష్ట వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగకరమైనా, ఖర్చుతో కూడుకున్న సౌకర్యవంతమైన సాధనంగా ప్రకటించారు. ఇది మానవ రహిత లేదా మానవ సహిత అన్వేషణ మాడ్యుల్‌ గ్రహ ల్యాండింగ్‌ నుంచి వీటీఓఎల్‌ విమానం భౌగోళ ల్యాండింగ్‌ వరకు అన్ని క్రాఫ్ట్‌లకు కీలకమైన లక్షణంగా పేర్కొన్నారు. సురక్షితమైన నిలువు ల్యాండింగ్‌లను నిర్ధారించడానికి టచ్‌ డౌన్‌ వేగం ఒక ముఖ్యం అని, నిలువు ల్యాండింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ల కోసం హైబ్రీడ్‌ రాకెట్‌ మోటారును ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. ఐఐటీ మద్రాసులోని ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ పీఏ రామకృష్ణ, డాక్టర్‌ జోయెల్‌ జార్జ్‌ మన్తారా, అనంద్‌ భద్రన్‌లు కలిసి రాసిన ఈ అధ్యయన నివేదికను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌లో పొందు పరిచారు. ఈ విషయంగా పీఏ రామకృష్ణ మాట్లాడుతూ,తమ పరిశోధన మేరకు విమానం నిలువుగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలు కల్పిస్తుందన్నారు. పొడవైన రన్‌ వేలు వంటి మౌలిక సదుపాయాల అవసరం లేదంటూ, వీటీఓఎల్‌ సామర్థ్యం పొడవైన రన్‌ వేలు, పెద్ద విమానాశ్రయాలతో పని లేకుండా మారుమూల ప్రాంతాలలోని కఠినమైన భూభాగాలకు టేకాఫ్‌, ల్యాండింగ్‌కు అవకాశం కల్పిస్తుందన్నారు. వీటీఓఎల్‌ వ్యవస్థ వాణిజ్య అప్లికేషన్‌ కోసం టెక్నాలజీ రెడీనెస్‌ లెవల్‌(టీఆర్‌ఎల్‌)కు చేరుకున్న తర్వాత , అది పౌర, సైనిక విమానయానం రెండింటిలోనూ గేమ్‌ చేంజర్‌ అవుతుందన్నారు. ఒక పెద్ద విమానాశ్రయం లేదా ఎయిర్‌ బేస్‌ కంటే బహుళ ప్రదేశాలకు వాయు రవాణాను వికేంద్రీకరించడానికి సహాయ పడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement