క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 14 2025 5:01 AM | Updated on Jul 14 2025 5:01 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

గొంతుకు ఊయల బిగించుకుని విద్యార్థి మృతి

పళ్లిపట్టు: ఊయల గొంతు బిగించుకుని 9వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. వివరాలు.. పొదటూరుపేట పోలీసుల కధనం మేరకు.. దిగువ నెడిగళ్లు గ్రామానికి చెందిన నాగరాజ్‌ అతని భార్య జ్యోతి దంపతులకు ప్రేమలక్ష్మి(16), కిరణ్‌(14) అనే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో కిరణ్‌(14) తిరుత్తణిలోని ప్రయివేటు పాఠశాలలో 9వ తరగతి చదువుకునేవారు. ఈ క్రమంలో నాగరాజ్‌ అతని భార్యతో కలిసి ఆదివారం బందువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో కిరణ్‌ వుంటుండగా, చీరతో ఊయల కట్టి ఆడుకుంటుండగా, గొంతుకు ఊయల చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చుట్టుపక్కల వారు కాపాడి పొదటూరుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారి మృతి పట్ల పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి దారుణ హత్య

అన్నానగర్‌: అంబత్తూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అంబత్తూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మారాజ్‌పురం ప్రాంతానికి చెందిన అరుణాచలం (30). ఇతని భార్య రాణి. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి 11 గంటలకు అరుణాచలం భార్య రాణి, పిల్లలతో ఇంటి ముందు ఉన్నాడు. ఆ సమయంలో కత్తులు, కొడవళ్లతో ఒక రహస్య ముఠా అక్కడికి వచ్చి అరుణాచలంతో వాగ్వాదానికి దిగి అరుణాచలాన్ని దారుణంగా నరికి చంపారు. భార్య, పిల్లలు భయంతో కేకలు వేశారు. రాణి భర్తను కాపాడేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న అంబత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. వారు అరుణచలం మృతదేహాన్ని శవపరీక్ష కోసం కిల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రయం విషయంలో జరిగిన వివాదంలో ఈ హత్య జరిగిందని తెలిసింది. హత్యకు సంబంధించి వినోద్‌, శ్రీనివాసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

యువకుడి హత్య

– ముగ్గురు నిందితుల అరెస్ట్‌

అన్నానగర్‌: దిండుక్కల్‌ జిల్లా వత్తలకుండు సమీపంలోని అయ్యంగొట్టై గ్రామానికి చెందిన కోడి అలియాస్‌ కృష్ణన్‌ (25) మహిళలను ఎగతాళి చేశాడనే ఆరోపణలతో అయ్యంగొట్టైపుత్తూరు నివాసి దవపాండితో వివాదం ఏర్పడింది. దీని తరువాత, కోడి అలియాస్‌ కృష్ణన్‌ అయ్యంగొట్టైపుత్తూరులోని దవపాండి ఇంటికి వెళ్లి ఈ విషయంపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఉన్న దవపాండి తన బంధువులతో కలిసి శనివవారం రాత్రి అయ్యంకోటలోని ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణను ఊఫు మందై గ్రామంలోని కాళియమ్మన్‌ ఆలయ ప్రాంతానికి పిలిపించారు. రాత్రి యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితిలో, దవపాండి (25), అతని సోదరుడు నాగపాండి (23), స్నేహితుడు సంజయ్‌ (25) లు తాము దాచిపెట్టిన కత్తితో కోడి అలియాస్‌ కృష్ణన్‌ను నరికారు. తీవ్రంగా గాయపడిన కోడి అలియాస్‌ కృష్ణన్‌ సంఘటనా స్థలంలోనే మరణించాడు. తిలకోట్టై డీఎస్పీ సెంథిల్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీని తర్వాత, కోడి అలియాస్‌ కృష్ణన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం దిండుక్కల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలకు పంపారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ నేతృత్వంలోని పోలీసులు, హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు దవపాండి, నాగపాండి మరియు సంజయ్‌ను రాత్రిపూట అదే ప్రాంతంలో దాక్కున్న వారిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏడుగురు మత్స్యకారుల అరెస్టు

కొరుక్కుపేట: సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని రామేశ్వరానికి చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. వివరాలు.. రామేశ్వరం ఫిషింగ్‌ పోర్టు నుండి 456 ఫిషింగ్‌ బోట్లు మత్స్య శాఖ కార్యాలయం నుంచి అనుమతులు పొంది బయలుదేరాయి. వాటిలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్రంలో పడవలలో చేపల వేటకు వెళ్లారు. శ్రీలంక సరిహద్దులో ఉన్న నెడుంతీవు సమీపంలో చేపలు పడుతున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీలంక నేవీకి చెందిన గస్తీ పడవ కొద్ది దూరం నుంచి మెరుపు వేగంతో మత్స్యకారుల పడవలను చుట్టుముట్టారు. తర్వాత శ్రీలంక నావికాదళం సిబ్బంది మత్స్యకారులైన షణ్ముగం (30), దుతార్‌ (40), ఎడిసన్‌ (51), శక్తివేల్‌ (47), జేసుదీష్‌ (48), దల్విన్‌రాజ్‌ (46), అన్బళగనన్‌ను అరెస్టు చేసి ఫిషింగ్‌ బోట్‌లో తీసుకెళ్లారు. దీంతో వారిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి రామేశ్వరం జాలర్లు విజ్ఞప్తి చేశారు

ఇంటిపై పెట్రో బాంబులు

అన్నానగర్‌: రిటైర్డ్‌ ఎల్‌ఐసీ ఉద్యోగి ఇంటిపై పెట్రో బాంబులు విసిరారు. నైల్లె జిల్లాలోని అంబై ముడప్పాలం నార్త్‌ స్ట్రీట్‌కు చెందిన రవిచంద్రన్‌ (65) రిటైర్డ్‌ ఎల్‌ఐసీ ఉద్యోగి. శనివారం రాత్రి కొంతమంది యువకులు అతను నివసించే వీధిలో స్నేహితుడి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో వారు వీధిలో కేక్‌ కట్‌ చేస్తూ వీరంగం సృష్టించారు. దీంతో రవిచంద్రన్‌ వారిని మందలించాడు. దీంతో యువకులు అర్ధరాత్రి రవిచంద్రన్‌ ఇంటిపై నాలుగు పెట్రో బాంబులు వేసి పారిపోయారు. వాటిలో 2 పేలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పేలని రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement