
సెంజి కోటకు యునెస్కో గుర్తింపు
సాక్షి, చైన్నె: సెంజికోటకు యునెస్కో గుర్తింపు దక్కింది. పురాతన ప్రదేశాల అధ్యయనంలో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. రాష్ట్రంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం, మహాబలిపురం, కుంబకోణం ఐరాతీశ్వరర్ ఆలయం, నీలగిరులు వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తింపును దక్కించుకుని ఉన్నాయి. తాజా గా జాబితాలో మరాఠా రాజుల స్థావరంగా ఉన్న సెంజి కోటను ప్రభుత్వ సిఫారసు మేరకు యునెస్సో గుర్తింపు కల్పిస్తూ ప్రకటన వెలువడింది. 1678లో మరాఠాలు సెంజి కోటను తమ గుప్పెట్లోకి తెచ్చుకు న్నారు. ఇది ప్రస్తుతం విల్లుపురం జిల్లాలో ఉంది. సెంజి అనే ప్రాంతంగానే ఈ కోట పేరిట పట్టణం వెలసి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో అప్పటి మైనారిటీ శాఖ మంత్రి సెంజి మస్తాన్, నాటివిల్లుపురం కల్టెర్ పళణి నేతృత్వంలో ప్రత్యేక బృందం సెంజి కోటకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.ఈ కోటలోని కల్యాణ మహల్, దర్బార్ హాల్, ఎలిఫెంట్ పూల్, మ్యూజియం, కోటలోని వంతెన, కొండపై ఉన్న ఫిరంగులు వంటి అనేక అంశాలు ఈనివేదికలో పేర్కొన్నారు.ప్రస్తుతం అన్నిరకాల పరిశీలన తదుపరి మహారాష్ట్రాలోని చత్రపతి శివాజీ పాలించిన కోటలను, తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజికోటను వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తింపు కల్పించింది.
సెంజి కోట