
విచారణ కమిషన్‌కు సిద్ధం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో చేసిన అప్పులకు విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఎడపాడి చెప్పడం విడ్డూరంగా ఉందని వీటికి తాము అందుకు సిద్ధమని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబర్తి గ్రామంలో నాబార్డు నిధుల నుంచి రూ: 24.82 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌డ్యామ్ నిర్మాణ పనుల కోసం అడుగు భాగంలో ఎనిమిది అడుగులలోతు తీసి పనులు చేస్తున్నామన్నారు. ఈ చెక్‌డ్యామ్ ఏర్పాటు చేయడం వల్ల కాట్పాడి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. వీటితో పాటు కావనూరు చెరువు నిండి అందులో నుంచి వచ్చే నీరు పూర్తిగా ఈ చెక్‌డ్యామ్‌కు వస్తుందన్నారు. అదేవిధంగా అరుంబర్తి గ్రామంలో రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. డీఎంకే ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూసి ఎడపాడి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, అధికారులు పాల్గొన్నారు.